పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/78

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాచీనాంధ్రం : శాసనభాషాపరిణామం 63

మొదట బిందువుగా ఉండి తరవాత సున్నగా మారిన సంకేతాంశం పూర్ణార్ధ బిందువులను రెంటినీ సూచించేది. ఛందస్సును బట్టి ఆర్ధానుస్వారమూలరూప నిరూపణం సాధ్యమవుతుంది. కొన్ని సమయాల్లో అనుస్వారానికి బదులు పరసవర్ణాదేశమే లేఖనంలో ఉన్నా, ఛందస్సును బట్టి అరసున్న (అనునాసిక్యం) ఉన్నట్లు నిరూపించవచ్చు. ఉదా... ప్రభుం బణ్డరంగుం బణ్చిన...పణ్డ్ఱెణ్డుంగొని...వేంగినాణ్టిం... (భారతి 5.473-84.4-6,848) అనేభాగాన్ని '*ప్రభుఁ బండ రంగుఁ బణ్చిన...వేఁగినాఁటిఁ' అనే చదవాలి. 'గవజ్వాంబ్‌... కొట్టంబుల్‌.... పై. 3, 6) అనేచోట్ల '*గర్వమ్‌...కొట్టముల్‌' అనే పఠించాలి. లేదా ఛందో భంగం. బిందుపూర్వక బకారాన్ని మకారానికి బదులుగా రాయటం క్రీ. శ. ఏడో శతాబ్ధం నుంచీ ఆచారంగా ఉండేదని గ్రహించాలి. సంప్రదాయ పండితులు దీర్ఘం మీద అర్ధానుస్వారం లేదంటారు. కాని 'కూంతు సరియ పోల్పం గాంత లెంద్దు' (రా. ప. సం. 25-29.11, 1065) వంటివి అందుకు విరుద్ధంగా ఉన్నాయి. నన్నెచోడుకి కవిత్వంలోని వీండె ఖలుండు. దక్షుఁడను వీఱిఁడి పాఱుఁడు...బ్రహ్మాండము..' మొదలైన ప్రయోగాలను ఇక్కడ అనుసంధించినప్పుడు ప్రాచీనాంధ్రంలో మాండలికంగా నయినా అర్ధానుస్వారం ఉండేదని తెలుస్తుంది. బిందువు మీది పరుష సరళాలను ద్విత్వంచేసి పూర్ణబిందువును చేయక ఖండబిందువును పూర్వులు నిర్జేశించేవారన్న విశ్వాస మొకటి ఉంది. అయితే ఈ ఆచారం అన్ని సందర్భాల్లోనూ చారిత్రక కాలంలో నియతంగా కనిపించదు. ఉదా. (i) పూర్ణబిందువే ఉండవలసినా ద్విత్వహల్లు లేని శబ్దాలు : పణ్డురంగు (భారతి 5.792.10,848-49). బింకమ్‌ (పై. 618.7,897); (ii) ఖండబిందువు లేకపోయినా ద్విత్వహల్లులున్న శబ్దాలు : సామంత్త (పై. 473-84.5, 848). ఎత్తించ్చె (EI 4.314-18.20, 1075-76). అర్ధానుస్వారం పూర్వాచ్చును అనునాసికంగా ఉచ్చరించటాన్ని సూచిస్తుందని కేతన (ఆం. భా. భూ. 30,56,57) మాటలను బట్టి ఊహించాలి. అంతకు మించిగాని, అందుకు విరుద్ధంగా గాని నిదర్శనాలు లేవు. పర్యాయోపయోగం కారణంగా అనుస్వారం అనునాసిక వర్ణాలకు ప్రత్యామ్నాయి సంకేతమేగాని ప్రత్యేకవర్జం కాదని చెప్పవచ్చు. 3.24. అచ్చంధులు : పదాంతంలోని అత్తు సంధిలో లోపించటం క్రీ. శ. [9/10 శతాబ్ది నుంచి కనిపిస్తుంది. యడాగమంగల రూపాలు క్రీ. శ. ఏడో శతాబ్ది నుంచి కనిపిస్తుంటే ఆరో శతాబ్దిలో పదాంతాత్తు నిలిచి ఉన్నట్టు నిదర్శనా లున్నాయి.