పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/77

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62. తెలుగు భాషా చరిత్ర

పదాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఉదా. కళర్‌ (భారతి 5.935-48.13,675), కళార్‌ (EI 30.12.26-27,8). 'కలవారు' నుంచి అర్వాచీనకాలంలో 'కలార్‌' ఏర్పడ్డదనే మన వ్యాసకర్తల భావం. ప్రామాదికమని ఈ నిదర్శన నిరూపిస్తుంది.

3.22. అనుస్వారం : పరుష సరళాలకు ముందు అనుస్వారం వాడటమనేది ఆర్యభాషా ప్రభావం వల్ల చాలా ప్రాచీనకాలంలోనే తెలుగులోకి వచ్చిన సంప్రదాయం. పదాంశాల్లో, వాటి అవధుల దగ్గరా, పదాంతంలోనూ పరసవర్ణాదేశం చేయటమో అనుస్వారాన్ని దానికి బదులుగా వాడటమో క్రీ. శ. నాలుగో శతాబ్ది నుంచీ కనిపిస్తుంది. ఉదా. (i) పదాంశంలో : పణ్టూర (పై. 6.315-19.24,234), కంగూర (పై. 17.327-29.3,4). (ii) పదాంశావధివద్ధ ; చెఞ్చెఱువ (భారతి 1.110-22. 13-14, 395-410). విలెంబలి (పై. 334-37.9,610), (iii) పదాంతంలో : ఏళన్‌ (EI 27.221-25.5, 575-600), ప్రవర్తమానం (పై. 29.160-64.5,680). వ్యాకరణాలు స్పష్టంగా నిషేధించక పోయినా సాంప్రదాయ పండితులు తప్పుగా భావించే పంక్త్యాది అనుస్వార లేఖనం కూడా క్రీ. శ. ఏడో శతాబ్ది నుంచి శాసనాల్లో కనిపిస్తుంది. ఉదా. పులొ -ంబున (SII 6.584.6 - 7,641). అనుస్వార పరసవర్ణాల్లో ఏది రాయాలో తేల్చుకోలేక (i) ఒకే పదంలో రెండూ రాసినవీ (ii) ఏదో ఒకటి రాయబోయి తప్పుగా రాసినవీ కనిపిస్తాయి. ఉదా. నాంణ్డు (JAHC 3.16-21.11,) 678), (ii) సజ్వత్సరంబు (EI 30.12-8,8). క్రీ శ. నాలుగో శతాబ్ది నుంచి అనుస్వారం వాడుకలోకి వచ్చినా ఏడెనిమిది శతాబ్దుల నాటికి గాని ఈ వాడుక నిలదొక్కుకోలేదని ఈ స్థితికి అర్థం. మొత్తం మీద అనుస్వారం కన్న పరసవర్జాదేశమే అధిక ప్రాచుర్యంలో ఉండేది. క్రీ. శ. పదకొండో శతాబ్ది నుంచి అనుస్వార లేఖనం ప్రచురతరమయిందికాని పూర్వమర్యాద పూర్తిగా తొలగిపోలేదు. జ, మ లకు బదులుగా బహుళంగాను, ఞకారానికి బదులుగా సమాన వ్యాప్తితోను, ణ, న లకు బదులుగా విరళంగానూ, అనుస్వారం వాడుకలో ఉండేది. దేశ్య శబ్దాల్లో పరుష సరళాలకు ముందు, తద్భవాల్లో ణ, ప, లకు ముందు కూడాను, తత్సమాల్లో మహా ప్రాణాలకూ య, స, శ, హ, లకు ముందుకూడాను *అనుస్వారం కనిపిస్తుంది.

'3.23. అర్థానుస్వారం : అర్ధానుస్వారానికి లిపి సంకేతం లేదు.