పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/71

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముంజేరులోని క్రీ. శ. 709 నాటి శాసనంలో 'కేచిని' (CP 10 of 1908-9) అనే రూపం, ఉదయగిరి తాలూకాలోని భైరవకొండ శాసనాల్లో “కేనిన” (SII 10.54. 1-2,7), 'కేసరి' (పై. 47,7) అనే రూపాలు, తాడిపత్రి తాలూకా కొత్తూరులోని ఒక శాసనంలో 'కేసి' (EI 30.69-71.5,699-700) అనే రూపం, కనిపిస్తాయి. ఆదే కాలపు నెల్లూరు జిల్లా శాసనాల్లో “చేయ” రూపాలు కూడా ఉన్నాయి, అంటే 'కేయి' రూపాలు ప్రాచీనలేఖన సంప్రదాయంగా మాత్రమే నిలిచాయిగాని ధ్వనిపరిణామం అప్పటి కెప్పుడో పూర్తయిందని అర్థం.

3.7 పదాది నరళాలు : ప్రాచీనాంధ్రంలో జరిగిన ప్రధాన ధ్వని పరిణామాల్లో పదాది సరళాల విషయం ఒకటి. అసలు ప్రాచీన ద్రావిడంలోనే పదాదిన సరళాలు లేవని ఆర్‌. కాల్ద్వెల్‌ (191.338-39), కె. వి. నుబ్బయ్య (IA 38.193-221), టీ. బరో (BSOAS 9.711-22), భద్రిరాజు కృష్ణమూర్తి (1961, 1.55,1.70-73), వాదిస్తుండగా, ఉన్నవని ఴూల్ బ్లాక్ (IA 48. 194-95), గోదవర్మ (BSOAS 8.562), కోయిపలర్ (పై. 9.987), ఎ.మాస్టర్ (పై 1008), ఎన్‌ కె ఛటర్జీ (IL 14.9-15)లు విశ్వసించారు. శాసనభాషను బట్టి చూస్తే మొదటివారి వాదాన్ని సవరించనక్కరలేదనిపిస్తుంది. అందుకివి ప్రధాన కారణాలు : (i) క్రీ. శ. 7వ శతాబ్దికి ముందున్న వ్యుత్పత్తి స్పష్టంగా తెలిసిన దేశ్యపదాల్లో సరళాదులు కనిపించవు. (ii) క్రీ. శ. 6వ శతాబ్ది నుంచి అల్పాల్పంగా సరళాది తద్భవాలున్నాయి. (iii) పరుషాది సరళాది రూపాలు రెండూ ఉన్న పదాలు ఇంచుమించు ఏకకాలంలో శాసనభాషలోనే కనిపిస్తున్నాయి. ఉదా. ఖణ్డుగ (EI 10.100-6.28,674) . గణ్డుగ (SI 10.217.7, 745-801). (iv) పదాది సరళాలున్న కొన్నిమాటలకు స్థిరాది పర్యాయపదాలు కలిపిస్తున్నాయి. ఉదా. బాణ(పై 23.23, 719-20) వాణ (EI 30.69-72.2, 699-700). (v) ఎరువు మాటల్లోని పదాది సరళాలనే పరుషీకరించిన నిదర్శనాలున్నాయి. (vi) వ్యుత్పత్తి నిర్ణయం సరిగా సాధ్యపడని “గుజంబు, గెల్బి" వంటి నాలుగైదు మాటలను బట్టి మూలద్రావిడంలో పదాది సరళాలున్నాయనటం సిద్ధాంతం కాదు. (vii) పదాది సరళాలున్నా వ్యక్తినామ స్థలనామాల వ్యుత్పత్తి సందిగ్ధ మయింది.