పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/184

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 169

వాక్యాలు

5.61. శాసనభాషలోని వాక్యాల్ని స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. 1. సామాన్యవాక్యం. 2. సంశ్లిష్టవాక్యం. సామాన్య వాక్యాల్ని రెండుగా చేయవచ్చు. 1. క్రియాసమాపకం, 2. విశేషణసమాపకం.

5.62. క్రియాసమాపక వాఖ్య౦. ఇందులో ఒక సమాపకక్రియ తప్పని సరిగా ఉంటుంది. దానికి కర్త్రు పదం ప్రథమావిభక్తిలో ఉంటుంది. ద్వితీయాది విభక్తులతోడి నామపదాలు కూడా అయా సందర్భానికి తగినట్టు రావచ్చు. భావయ ప్రసాదించిరి (SII 5.26.7,1412), మల్లసానమ్మ సమర్చించెను (పై. 584.27, 1494) మొ.వి. పై వాక్యాల్లో భావయ, మల్లసానమ్మ కర్తలు. ప్రసాదించిరి, సమర్చింపెను క్రియలు. యీ మండపము నరహరి నేనింగారి. పంపున కిరిలేంక శిరిగిరి నేండు గట్టించెను (పై. 5. 133.7, 1416). ఈ వాక్యంలో కట్టించెను క్రియ, ఈ మండపము కర్మ కిరిలంక శిరిగిరి నేండుకర్త. నరహరి నేనింగారి పంపున _తృతియావిభక్తితోడి పదబంధం. కర్తలోపించికూడా వాక్యం రావచ్చు. ఉగ్రనిచింగబోఇని కొడుక పోలబోఇని గోచరవెటితిమి (SII 5.6,1445).

పై విషయాల్లో సాహిత్యభాషకూ, శాసనభాషకూ వ్యత్యాసం ఏమీ లేదు. కాని కర్తకు సమాపక క్రియకు గల సంబంధం విషయంలో కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి. సాహిత్యభాషలో కర్త ఏ పురుషలో ఉంటుందో క్రియకూడా ఆ పురుషలోనే ఉంటుంది. శాసనాల్లో ఆలాంటి వాక్యాలు ఉంటాయి. కాని అక్కడక్కడ శాసనాల్లో కర్త ప్రథమపురుషలోనూ క్రియ ఉత్తమపురుషలోనూ కనిపిస్తాయి. కొటికలపూండి గంగయ్యను కాని పాపకామినేండున్ను...సమర్చణ చేస్తిమి (SII 5.48.11.19,1450). ఇందు గంగయ్య, కామినేండు కర్త్రు శబ్దాలు. సమర్పణచేస్తిమి సమాపక క్రియ. ఇలాంటి వాక్యాలు శాననాల్లో ఉన్నాయి. కాని ఇట్టివి భాషలో వ్యవహారంలో ఉన్నట్లు చెప్పలేము. శాసనాలు వ్రాసేటప్పుడు పేరు చెప్పాలి కాబట్టి కర్త పేరు చెప్పి ఆ కర్తకు సంబంధించిన క్రియ ఉత్తమపురుషంలో వ్రాయబడ్డదేమో !

కర్త గౌరవార్థరూపంలో ఉన్నా సమాపకక్రియ ఏకవచనంలో ఉండవచ్చు. నరహరిం నేనింగారు. ..కల్యాణమండపం గట్టించెను (SII 5.188.12-16,1410), వీరనంగారు... ధారవోశి సమర్పించెను (పై. 5.48.10-17,1458)మొ.వి.