పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/145

ఈ పుటను అచ్చుదిద్దలేదు

130

తెలుగు భాషా చరిత్ర

(8) పది, నూఱు రూపాల్లో విశేషాలేమీ లేవు. నూఱు శబ్దానికి పర్యాయంగా నేడు ప్రయోగంలో ఉన్న వంద శబ్దం ఈ యగంలో కనిపించదు.

(9) వేయి; ఈ శబ్దానికి కింది రూపాలున్నాయి. వేయి (SII 5. 207.15. 1141), వెయి( పై. 5.1013.2, 1148). వేయు (పై. 4.930,14, 1165), వేయు ( పై. 6,1200.16, 1175 ), వెయ్యి (పై. 5.1202.2,1214). 'ఇ/ఉ' లు పదాంతంలో పర్యాయంగా రావడం నేయి శబ్దంలో కూడా చూడవచ్చు. అంటే ఇట్టిబ్దాల్లో చివరి అచ్చు ఊతకై వచ్చి చేరినదని చెప్పవచ్చు. ఈ వేయి శబ్దానికిపూర్వం రూపం వేన్‌ అని నిరూపించవచ్చు.4

(10) పదిపై కూడిక సంఖ్యలు : పండ్రెండు, పందొమ్మిది తప్ప మిగిలినవంతా పది శబ్దానికి ఆయా సంఖ్యలను చేర్చడంద్వారా అవుతాయి. ఆ చేర్చేటప్పుడు ఆహఅ రూపంలో ఉన్న సంఖ్యావాచకాలు తప్ప తక్కినవి చేరేటప్పుడు పది శబ్దానికి -ఉన్‌ -గాని, -న్‌- గాని చేరుతుంది. ఇందలి నకారం హల్లుల ముందు కనిపించదు. పదునకొండు (తె. శా. 1.41.8,1231). ఇందు నకారంపైన 'అ' వ్రాతపొరబాటయి ఉంటుంది. పదినొకండు ( SII 6.768.8, 1391 ), పదుమూండు (పై. 6.235.32, 1158), పదినాలువు (పై.6.1173.8 1104) మొ. వి. పైవాటిలో కేవలం -న్‌- చేరే రూపాలు విశాఖ - శ్రీకాకుళం ప్రాంతంలోను, -ఉన్‌ చేరే రూపాలు మిగిలిన ఆంధ్రదేశంలోను కనిపిస్తాయి. ఆహఅ రూపాలు చేరేటప్పుడు ఆ శబ్దాలు పది రూపానికి అలాగే చేరుతాయి. చేరేటప్పుడు సంధి కావచ్చు కాకపోవచ్చు. పదేను (SII 5.125.12,1296), పదియేను ( పై. 4.1314.7, 1148), పదాఱు (పై. 4.945.29, 1152), పదిఆఱు ( పై. 6.1000 15,1307) మొ.వి. పండ్రెండు, పందొమ్మిది రూపాలు -పన్‌-రూపానికి రెండు, తొమ్మిది శబ్దాలు చేర్చగా ఏర్పడుతాయి. *పన్‌-రెండు > పన్ఱెండు > పంఱెండు ( SII 6,973.7, 1359 ) > పండ్రెండు (పై. 5.70.12,1177), పన్‌ + తొమ్మిదిా > పందొమ్మిది ( పై. 6.865,20, 1286 ).