పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

యెంచితే తప్పకుండా వళ్ళుమండుకు వస్తుంది. వున్నమాటంటే వులుకువస్తుందన్న సామిత అందరూయెరిగిందే. నావంకరకాళ్ళ మాటతల్పెట్టే వాడుగనుక యేలాగయినా వీడికి గర్వభంగంచేసి మరీ పంపవలెను. (బిగ్గరగా) వానివంకరకాళ్ళు కావడానికి కంచెలు దూకితే వాకాళ్ళుయెవరూ విరుగ గొట్టలేదు. నాకాళ్ళు వేరేవిధంగా వుపయోగించు కోవలసిన అవసరంలేదు. యెంత గెడకర్రలలాగువున్నా నీకాళ్ళకంటే నాకాళ్ళేయెక్కువ వుపయోగంగాను అందంగాను వున్నవి. నీవునన్ను ఆక్షేపించనక్కరలేదు.

శళ---నీవు కంచెలు దాటకపోతే రాత్రిళ్ళు కన్నాలలోనుంచి యిళ్ళల్లో దూరడంచాత నీకాళ్ళు వంకరపోయినని. యెవరి కాళ్ళు యెక్కువ వుపయోగం అయిందీ నాలుగు అడుగులు పురుగెత్తితే తెలుస్తుంది.


మూష---అలాగే పరుగెత్తుదాం పందెంవెయ్యి. యేమె మిపందెము?


శళ---ఇప్పుడు బాగావున్నవి. నేను నీమనసువచ్చింది పందెంవేస్తాను. ఇప్పుడే పరుగెత్తుదామురా. అన్నమాటకు నీవు తిరిగి పోకూడదు.

మూష---తిరిగిపోటే పరుగెత్తాలేక నీవు తిరిగిపోతావుగాని నేను యెన్నటికీ తిరిగిపోను. ఇప్పుడు వరహావరహా. పందేం నేనుతిరిగిపోతే రేపటినుంచి నన్నీపేరుతో పులువవద్దు. చిన్నప్పటినుంచీ కందమూలఫలాలు భక్షిస్తూతపస్సుచేసి యీపొలంలోవున్న పందికొక్కులకన్నిటికీ గురువునయి సంపాదించుకొన్న భట్టర్ బిరుదు నేటితోతీసి పారవేస్తాను.

శళ---నీవువేసినపంద్యానకు వప్పుకున్నాను. గాదెకింది పందికొక్కులాగు నీవుయెంతసంపాదించినా నీదగ్గర డబ్బువుండదుకగనుక నీవు వక్క వారహామాత్రమే పందెమువేసినావుగాని నేను వోడిపోతేనీకు పదివరహాలుయిస్తాను. యెక్కడనుంచి యెక్కడదాకా పరుగెత్తుదామో చెప్పు.

మూష---పొలంవాడువచ్చేసమయమయం అయినది. గనుక పరుగెత్తడానికి యిదిమంచిస్థలంకాదు. అదుగో ఆదున్నినపొలంలో ఆఅకంచెకాడినుంచి యీకంచెదాకా పరుగెత్తుదాము.

శళ---అలాగయితే పరుగెత్తుదాము బయలుదేరు.

మూష--- తొందరపడక కొంచెముసేపుతాళు. నెనునిన్న యేకాదశినిలహారం చేసినాను. ఇంటికివెళ్ళి ద్వాదశిపారణచేసివస్తాను. మాఇల్లు ఇవతలికంచెలోవున్నది. నీవు అవతల కంచెదగ్గరవుండు. నెను భోజంచేసివచ్చి నిన్ను యిప్పుడేకలుసుకుంటాను. పందెం అక్కడనుంచే ఆరంభింతాము.

శళ---ఈవంకపెట్టి మళ్ళీరాకుండా మాయ మయ్యేవుసుమీ. ఈలోగా నే