పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/99

ఈ పుట ఆమోదించబడ్డది

64

తిరుమల తిరుపతియాత్ర.


నాల్గవదినము._____

1 పగలు కల్పవృక్ష వాహనము.

2 రాత్రి సర్వభూపాలవాహనము (రెండును తాయార్లు సయితము)

అయిదవదివసము.____

1 పగలు మోహినీ అవతారము పాలకీ ఉత్సవము.

2 రాత్రి గరుడవాహనము.

ఆఱవదివసము._____

1 పగలు హనుమంతవాహనము (మొదటిఘంట యయిన పిదప) వసంతోత్సవము. (రెండవఘంటసపిదప)

2 రాత్రి ఏనుగువాహనము.

ఏడవదివసము.______

1 పగలు సూర్యప్రభవాహనము.

2 రాత్రి చంద్రప్రభ వాహనము.

ఎనిమిదవ దివసము._____

ఈ దివసమున తెల్ల వారుసరికి మొదటిఘంట అయిన పిమ్మట శుభముహూర్తమున శ్రీవారు అమ్మవారుల సయితం రథారూడు లగుదురు. సాయంకాలమునకు రథము నాలుగు వీధులు తిరిగి యధాస్థానమునకు వచ్చినతఱువాత శ్రీ వారు సన్నిధికి వెళ్లఁగా రెండవఘంట అపును. వెంటనే రాత్రీ ఘంట అయి గుర్రపువాహనము జరుగును. శ్రీవారి బ్రహ్మో త్సవములో గురువారము రాత్రిన్ని, శుక్రవారము విశ్వ