పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/90

ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

57

 విజయంచేసిన తఱువాత రాత్రి తోమాల సేవ మొదలగునవి జరుగును.

ఆర్ద౸.

శ్రీ భాష్య కారులవారి తిరునక్షత్రమయిన అర్ధా౸నక్షత్రమున రెండవఘంట అయిన తెఱువాత శ్రీ వేంకటేశ్వరస్వామివారు,అమ్మవార్ల సహావెండితిర్చిలో విజయము చేసి శ్రీభాష్యకార్లను అభిముఖముగ నొకతిర్చిలో నుండి నాలుగువీధుల ఉత్సవమయి దేవస్థానములో శ్రీభాష్యకార్లగుడికి ముందుముటపములో శ్రీవార్లు విజయము చేసిన పదంపడి పొంగలి, శుం డలు. (శనగపప్పు) ఆరగింపవును. ఆస్థానములో గోష్ట వినియో గమయినపిదప శ్రీవారు తాయర్ల సయితము సన్నిధిలో నికి విజయము చేయఁగ రాత్రి తోమాల సేవ మొదలగునవి జరుగును.

ధర్మము.

పునర్వసు నక్షత్రము.

శ్రీరాములవారి జన్మనక్షత్రమైన ప్రతి పునర్వసు నక్షత్రమందు శీతాలక్షణ హనుమత్సహిత శ్రీరాముల వారికి నుత్సవము జరుగును. ఇది శ్రీహత్తీరాంజిమఠం అధికారి శ్రీరామ లఖన్ దాస్ జిగారు దేవస్థానములో సొమ్ము కట్టినందున శాశ్వ తముగ నుత్సవము జరుగును. శ్రీ రాములవారు పడమటవీధి లోని ధర్మకర్తగారు కట్టించిన మంటపములోనికి విజయము చేసి దోశ ఆరగింపు వినియోగాదులయిన తుఱువాత మహాప్ర