పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది

vii

భించిరి. దేవస్థానములు శ్రీమహంతుల స్వాధీనము జేయుసరికి వత్సరంబునకు సుమారు 1.5 లక్ష రూపాయలు రాబడి ఉండెను. 1906-1907 వత్సరములో రు. 4, 43, 158-9-9లు రాబడి వచ్చెను. 1919–1920 వత్సరమున అనగా 1329 ఫసలీలో 14, 97, 267-18–4 రాబడి గల్గెను. ప్రస్తుతపు శ్రీవిచారణకర్త లైన శ్రీమహంతు ప్రయాగదాస్ జీ వారి వలన ఖరీదు చేయబడిన రెండు తాలూకాలు అనగా తిరుతని కచ్చినాడు తాలూకాలు వలన రాబడే 4 లేక 5 లక్షల రూపాయలు కూడ పై మొత్తములో చేరియున్నది. తిరుతని కచ్చినాడు తాలుకాలు గాక కార్వెటి నగరం సంస్థానములో చేరిన అత్తిమాంజేరి మొదలు 62 గ్రామాదులు కూడా ఇటీవల ఖరీదుకు తీసియున్నారు.

తిరుపతిలో నొక హైస్కూలు వేలూరులో నొక హైస్కూలు ఉంచబడి పరిపాలింప బడుచున్నవి. తిరుపతిలో నొక సంస్కృత పాఠశాల కలాశాలగా చేయించి అందులో ఒక ఆయుర్వేద శాఖను కూడా ఏర్పరచి విద్యార్థులకు బసభోజనములిడి విద్యా బుద్ధులు గరపుటకు శ్రీ విచారణ కర్తలవారు ఏర్పాటు చేసియున్నారు. ఇంతియగాక ఆయుర్వేద శాఖకుచేరి ఒక ఆయుర్వేద వైద్యశాలయు తిరుమలలో నొక డిస్పెన్సరియు ఏర్పరచి జనులకు ధర్మార్ధముగ మందు లిప్పించుచున్నారు. యాత్రికులకు తిరుమల తిరుపతిలో భోజన సదుపాయములు జేసినారు. బసలకు సత్రములునిర్మించుచున్నారు, ఇంకను తిరుమలలో నీటివసతికి, శాని టెషనుకు అనేక పనులు జేయించుచున్నారు. తిరుమలలోను మార్గమునందును వెన్నెల చీకటి అను భేదము లేక అటవీ మృగబాధతొలగించి రేయింబగలను