పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/89

ఈ పుట ఆమోదించబడ్డది

56

తిరుమల తిరుపతియాత్ర.

పక్షదిట్టము.



ప్రతి ఏ కాదశికి మూలవరులకుఁ గాక ఇతర మూర్తులకు తిరుమంజనముజరుగును. ద్వాదసులందును బహుళఏకా దసులందును విశేషనివేదనైన దధ్యోదనము జరుగును.

శ్రవణ నక్షత్రదిట్టము.

శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణనక్షత్రము రోజున శ్రీఉత్సవరులకు తాయారులసయితము తిరుమంజనమయి శ్రీవారి రెండవఘుంట అయినవెంటనే విశేషవస్త్రా౸భరణంబుల నలంకారంబులు గావించి బంగారు తిరిచితో నుత్సవము శోభాయమానముగ నాలుగువీధుల జరిపించి దేవస్థానములో బంగారువాకిలి కెదురుగ రంగమంటపములో మేచేయింపు చేసిన పిదప చక్కెరపొంగల్ , శుండల్, (శనగలు) దోశలు, ఆరగింపయి గోష్టి వినియోగమవును. అనంతరము వివేషాలు కారము తీసి శ్రీవారు సన్నిధిలోనికి విజయము చేసిన తరువాత తోమాల సేవ, అర్చనఘంట మొదలగునవి మామూలు ప్రకారము జరుగును.

రోహిణి

శ్రీకృష్ణ స్వామివారి జన్మనక్షత్రమయిన రోహిణీ నక్షత్రమందు రెండవఘంట యయిన పిదప శ్రీరుక్మిణీసమేత శ్రీకృష్ణస్వామివారికి నాలుగువీధు లుత్సవమవును.అనంతరము శ్రీవారికి రంగమంటపములో పొంగలి, శనగపప్పు ఆరగింపయి ఆస్టానములో వినియోగమవును. తఱువాత శ్రీవార్లు సన్నిధిలోనికి