పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/86

ఈ పుట ఆమోదించబడ్డది

54

తిరుమల తిరుపతియాత్ర.


మధ్యాహ్నము రెండవఘంట నివేదనకు దేవస్థానపు స్వంత ప్రసాదములున్నవి. మొదటిఘంటకు నివేదన కాని ఆర్జిత పదార్థము లున్నంతట ఇప్పు డారగింపవును. రెండపఘంట నివేదనయిన ఒక గంగాళం చక్కెర పొంగలి దేశాంతర బ్రాహ్మణ వినియోగము చేయఁబడును.

రాత్రిఘంటకు నివేదన దేవస్థానపు స్వంతప్రసాదమయినందునఁ గొంత మర్యాదలక్రిందను, కొంత దేశాంతర వినియోగమునకును ఖర్చు పెట్టఁబడును. రాత్రి ఇది తప్ప దేశాంతర బ్రాహ్మణులకుఁ బెట్టు అన్న సత్రములు లేవు. రాత్రి తీర్మా నమయిన వెంటనే యొక చిన్న గంగాళము చక్కెరపొంగలి దేశాంతరులకు వినియోగము చేయింపఁబడును.

గురువారము పూలంగి యయిన తఱువాత వడపప్పు, పానకమును శుక్రవారము రెండవఘంటకు పోళీలు, వడపప్పు, పానకమును కూడ ఆరగింపవును.

ఆర్జితధర్మముల పణ్యారములు --- చ స 34. గము వలెత్రికాలని వేదనలలో ఎప్పుడైనను సను ' ' ' యాత్రికులు

పరఖామణి.

యాత్రికులు ముడుపులు దేవస్థానము పారుపత్యదార్ కచ్చేరిలో చెల్లించెదరు. లేదా డబ్బి, జోలి, గోలక్. కొప్పెర అని వేర్వేరు నామములచే వ్యవహరింపఁబడు హుండి పారు పత్యదార్ కచ్చేరికి ఎదురుగను త్తర భాగమున పహారాబందో బస్తులోనుండు రాగిగంగాళము పొరలుగల దళముగుడ్డ బుర్కాలోనుంచబడి గోల్సులతో నిలువెత్తునఁగట్టబడి నాలు