పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/79

ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర. 47

దనఘంట జరుపుదురు. తోమాలసేవ, అర్చనరహస్యముగ జరుగును. ఎవరిని వదలరు. నివేదనఘంట తఱువాత మధ్యాహ్నమువలె ధర్మదర్శనముండును. వెంటనెకొప్పెరవిప్పి యందలి సొత్తులను సంచిలోవేసి సీళ్లుచేసి భద్రముచేసి మఱుదినము దయమునఁగట్టి మధ్యాహ్నము విప్పగా నేర్పడిన కొప్పెర లోని ముడుపులతోఁ జేర్చి పారుపత్యదారి ఖచేరిలో పరఖామణి చేయఁబడును.

ఏకాంతశేవ.

రాత్రికొప్పెర విప్పినపరువాత శుద్ధి అయి మంచము వెండిగొలుసులతో జోడించి శ్రీపాదచందనము, పాలు, పండ్లు మొదలగునవి సన్నిధిలోనికి తీసుకొనిపోయిన వెంటనే తీర్మాన మనఁగా ఏకాంతసేవకు నుత్తరవీయఁబడును. అప్పుడు సన్నిధిలో శ్రీరాములవారి సన్నిధియనఁబడు రెండువహాలు తలుపులుమూసీ అర్చకులు మాత్రముండి శ్రీభోగశ్రీనివాసమూర్తి వారిని జోడించిన వెండిమంచము వెల్‌వెట్ పఱుపుమీద శయనాసీనులఁగఁ జేసి పాలు పండ్లు మొదలగునవి యారగింపు జేసి తలుపులు తీసిన వెంటనే ఏకాంతసేవకుగాను రు. 13-0-0లు పారుపత్యదార్ కచేరిలో చెల్లించి టిక్కెట్టుతీసుకొనినవారిని, ఆమంత్రణోత్సవము, బ్రహ్మోత్సవము, గృహస్థులను లెఖ ప్రకారము లోపలకు వదలెదరు. ఏకాంతసేవ టిక్కెటు 1-కి బ్రహ్మోత్సవములోను, నవరాత్రోత్సవములోను నలుగురను తక్కిన దినములలో 5 మందిజనమును వదలెదరు. వీరందఱు బంగారువాకిలిదాటి స్థపనమంటపమను మొదటి హాలులో