పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/78

ఈ పుట ఆమోదించబడ్డది

46 తిరుమల తిరుపతియాత్ర.

సేవలు జేయింపుమని పారుపత్యదారు హింసించు టుత్తమము గాదు.

అర్చన.

పైన నివరించిన ప్రకారము ఘంట దర్శనమైన తఱువాత శుద్ధిఅయి అష్టోత్తర నామార్చన అవును. ర్పు. 7-0–0లు చెల్లించి అర్చన రసీదు తీసుకొనిన గృహస్థులను సహస్త్ర నామార్చనలో చెప్పిన రీతిగ వదలి అర్చన జరుపఁబడును.

నివేదన.

తఱువాత శుద్ది, రెండవఘంట నివేదనఅయి పరివార దేవతల పైకి శ్రీభాష్య కార్యులవారికి మాత్రము శ్రీవారి ప్రసాదము ఆరగింపయి బంగారువాకిలి తలుపులు వేయఁగ నర్చకుడు మొదలగు లోని కైంకర్యపరులు బస కేగెదరు.

ఆర్జితోత్సవము లనఁగా గృహస్థులు సొముఖచేరీలో జెల్లించి చేయించెడి యుత్సవము లిపుడు జరుగవలసినది గనుక నుత్సవరులు వాహన మంటపమునకు మేళతాళముతో విజయము చేసెదరు. ఉత్సవములగుఱించి ప్రత్యేకముగఁ చెప్పంబడును. ఎండ చల్లబడినప్పుడున్ను, వర్షము లేనప్పుడున్ను జరుగును.

రాత్రిదర్శనము.

తిరుగ నర్చకులు, స్నానముచేసుకొని సంధ్యవేళలోను నార్జితోత్సవములు కాఁగా వచ్చి పారుపత్యదార్ ఉత్తరవుఁ బొంది బంగారువాకిలి తీసి శుద్ధి, తోమాలసేవ, అర్చన, నివే