పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/72

ఈ పుట ఆమోదించబడ్డది

40

తిరుమల తిరుపతియాత్ర

లు వారి భార్యలు తమ్ముడుయొక్క ప్రతిమలుగల మంటపము లోదింపనలెను. ఇందుకు విచారణకర్తలవారి వుత్తరవు గావలెను. అచ్చటనుండి ఘటాటోపము లేక ఖణితి పరదా అనెడి ముసుకులో బంగారు వాకిలివరకు వచ్చి యచ్చటనుండి లోపలకు ముసుకు లేకుండఁగ వెళ్లవలెను.

దర్శన కాలములో యాత్రికులు లోపల నొకవేళ సొమ్ము వేయదలఁచి నంతట తండువద్ద గల కులశేఖరపడి అనే వెండిగడపమీఁద మొహరులతో బీగముగలిగి పై మూత మీద రూపాయపట్టుటకు రంధ్రముగలిగి యుండు చిన్న పెట్టెలో వేయవలెను. ఇచ్చట పహరాగలదు. ఎవరి చేతికిని సొమ్ము నియ్యకూడదు. లోపల ధర్మార్థ మెవరికి సేదియు నియ్యగూడదు. ధర్మ దర్శనకాలములో నొక్కొక్కతడవకు కొంత మంది దర్శనమునకు వదలునపుడు మగవాండ్రను వేఱుగను నాఁడువాండ్రను వేఱుగను వదల వలసినదని కొందరు చెప్పెదరుగాని తాముమాత్రము తమ ఆఁడవాండ్రను వదలి ప్రత్యేకముగ దర్శనము చేయుటకు సమ్మతింపరు. ఇదేమాదిరి ఇతరులును అభిప్రాయపడి ఆఁడవాండ్రను వదలి వెళ్లరనే సంగతి గ్రాహ్యము. ఇందుకు నొక దృష్టాంతము చెప్పెదను. రయలులో నాడవాండ్రకు ప్రత్యేక మొక బండియున్న ను నచ్చటం గూర్చుండఁ బెట్టక ననేకులు తమ యాఁడవాండ్రను తమతో గూర్చుండఁ బెట్టుకొనుటఁ జూడ లేదా! కావున నిది జరుపుట యాత్రస్థులను కష్ట బెట్టుటని యెఱుఁగవలయును. అయినను కొన్ని వేళల నిది జరుపబడుచున్నది.