పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/62

ఈ పుట ఆమోదించబడ్డది

34

తిరుమల తిరుపతి యాత్ర.

నుండి వచ్చుచున్నది. యతికి బిక్ష చేయుట మంచిదని అనేకులీ మఠములో తదీయారాధనలు చేయించెదరు. ఇంకను రొఖ రూపముగ కానుక లిచ్చెదరు. తదీయారాధనాలకు రేట్లు నిర్ధారణ లేదు. సొమ్మును బట్టి వంటకములుండును. ఈ మఠములో కొందరు వైష్ణవ బ్రాహ్మణులకు భోజన మిడెదరు. ఇది తెంగల మఠము. తిరుపతిలో కూడ నీ మఠము కలదు. సంవత్సరములో కొంత కాలము జియ్యంగార్లు తిరుపతిలోనే యుండెదరు. తిరుమల మీద నుండు ఈ మఠములో శ్రీకృష్ణుడు మొదలగు విగ్రహములు గల దేవతార్చన గలదు. ఈ మఠంలో మూల పురుషుని తిరునక్షత్రం చాతుర్మాన్య సంకల్పదివసము మొదలగునవి శోభస్కరముగా చేయుదురు.

ఆచార్య పురుషులు.

ఈ దేవస్థానమునకు ఆచర్య పురుషులు 7 మంది. శ్రీ వైకుంఠములో సప్తమ ఋషులజోలె ఇచ్చట వీరు ఏడు మంది అని చెప్పెదరు. వీరి వంశములో పూర్యులు శ్రీ వారికి భక్తి శ్రద్ధలతో కైంకర్యములు చేసిరి.

ప్రధమాచార పురుషులు.

వీరు తిరుమల నంచి వంశములోని వారు. ఈ కుటుంబమునకు తోళప్పాచార్యుల కుటుంబమని పేరు. తిరుమల నంబి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తిశ్రద్ధలతో కైంకర్యము చేసిరి. వీరు వడ హలవారు.