పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/41

ఈ పుట ఆమోదించబడ్డది

18

తిరుమల తిరుపతియాత్ర.

దాకినంత మాత్రమున పదిపురుషాంతరములు దహించునని హితోపదేశం బొనర్ప నతడు సముద్రములో రత్నములు దేవతలు తీసికొనరా. అట్లనే రూపలావణ్యముచే నిన్ను గోరెదను. నరకంవచ్చినను సరే” అని చెప్ప నాకోకిలస్వర రంజితాంగి బ్రాహ్మణుడు బాపసంగమముచే నశింపకుండ రక్షించవల్సిన దని దేనతలను నవగ్రహములను ప్రార్థించి విష్ణునిగుఱించి యిట్లుపల్కె.

శ్లో. మాస్పృశాద్యమహీదేవ పాపినీం వ్యభిచారిణీమ్,
కస్స్పృశేదన్నిమార్తస్సన్ సర్పంవ్యాఘ్రంగజం ద్విజ,
పరపత్న్యోహిత త్తుల్యాః కిముచండాల కన్యకా,
ఉత్తమం పదమాస్థాయ నీచాయిచ్ఛంత్యధోగతిమ్.
జ్ఞానినోవతధా విప్రతవబుద్ధిస్తు తాదృశీ,
జాతీద్వే నిర్మితేపూర్వం విష్ణునాద్వి జసత్తమ.
స్త్రీత్వం పుంస్త్వం యధాతద్వచ్చాతుర్వర్ణంచ భూసుర,
బ్రాహ్మణస్య బ్రహ్మయోన్యాందంతు విచ్ఛం ప్రశస్యతే.
తధాద్యేషాంచ వర్ణానాం స్వస్వజాతౌ ప్రశస్యతే,
విపరీతమిమం మన్యేధర్మత్యాగం ద్విజన్మనామ్.
శరీరంత వవిప్రేంద్ర వేదపూతం విశేషతః,
ఋతుకాలేచ యన్మాతు స్తవపిత్రా సమాగమే.
రేతస్సృష్టం వేదపూతం గర్భాధానమి దవిదుః!
సీమంతం కల్పయామాసుర్మంత్రైర్వేదమయైర్ద్విజా.
దశ మేమాసినం ప్రాప్తే ప్రాసూతజన నీతవ,
తదాపిత్రా జాతకర్త కృతం నామచమంత్రవత్