పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/37

ఈ పుట ఆమోదించబడ్డది

14

తిరుమల తిరుపతియాత్ర.



శ్లో|| సమాలింగ్యభవేదేవ మిత్యుక్త్వాహరిణాధనః |
విసృష్టశ్చక్రసంఛిన్న స్త్యక్తవాంస్వకళేబరమ్ ||

అందుచే వృషభాచలమని పేరుపొందె.

(2) అంజనాచలము.

కేసరిభార్యయయిన అంజనా దేవి త్రేతాయుగములో పుత్రులు లేరను శోకముచే కన్నీళ్లతో శరీరమంతయు తడిసినదై మతంగమహర్షి వద్ద కేగి సాష్టాంగ నమస్కాముచేసి తనదుఃఖ కారణము జెప్పుకొన నా మునిపుంగవుండాలోచించి ఇట్లనియె “పంసాసరస్సునకుఁ బూర్వభాగమున 50 యోజనముల దూరముగ నృసింహ క్షేత్రముగలదు. దాని దక్షిణముగ నారాయణగిరికి నుత్తరముగనున్న శ్రీస్వామిపుష్కరిణికి క్రోశెడుదూరమున నున్న ఆకాశగంగకు బోయి 12 వత్సరములు తాపమాచరించిన నా పుణ్యఫలంబువలన సుపుత్రుండను బడయుదవు” అంత నామె మునివాక్యనుసారమునఁబోయి శ్రీస్వామి పుష్కరిణిలో స్నానమాచరించి అశ్వత్థవృక్ష ప్రదక్షణములుగావించి శ్రీవరాహ స్వామివారి దర్శనము చేసికొని యాకాశగంగకునేగి మునుల యొక్కయు భర్తయొక్కయు నానతి తీసికొని ఆహారవిసర్జన నియమముగలిగి తపమాచరించెను. కృశించిన శరీరముమాత్రముగలదై యీ ప్రకారము వ్రతముపూర్తియయినపిదప మహాబలుడైన వాయుదేవుఁడు వీర్యప్రపూరఫలం బొకటినియ్య నామె భక్షించె. అంత నామె గర్భవతియై 10 మాసములయిన తర్వాత పుత్రరత్ననుగు హనుమంతు డుద్భవించెను.

శ్లో|| హనుమంతమిమం ప్రాహుర్మునయోవీతకల్మషాః |
అంజనావ్రతమాస్థాయ పుత్రం ప్రాపగిరీశ్వరే ||