పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/21

ఈ పుట ఆమోదించబడ్డది

2

తిరుమల తిరుపతియాత్ర.

కట్టడములు గలవు. ఊరుబయట రీడింగ్ రూముగలదు. యాత్రికులకు సౌకర్యార్థముగ ననేక సత్రములుగలవు. ఇక్కడ తిరుపతి తూర్పు అనియు, తిరుపతిపడమర అనియు రెండు రయుల్వేస్టేషన్లు గలవు. తిరుపతి తూర్పుయాత్రికులు దిగుటకు సుఖము. ఈ స్టేషన్ పురమును చేరియున్నది.

2. యాత్రికుల నాదరించువారు:-

శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనము కొఱకు వచ్చుయాత్రికులు గూడూరు, రేనిగుంట పాకాల కాట్పాడి రయిల్వే జంక్షన్ల ద్వారాతిరుపతికి రావల్సినందున వీరిలోననేకు లాజంక్షన్లుకు పోయి యాత్రికులు రయిలు బండిలో నుండగనే యూరుపేరులు హెచ్చరించి తమ బసలకు రమ్మనివేఁడెదరు. వీరల మాటలన్నియు స్వబుద్ధితో యాత్రికులు యోచించి విశ్వాసముంచవలెను. వీరలయిండ్లకు వెళ్లిన బసపాత్ర సామాను లిప్పించెదరు. బియ్యము మొదలగు సామానుల నంగడి (లేక దుఖాన్) లోగొనునప్పు డంగడివా రింకొకరికి నీసామానులకు గాను రుసుమియ్యకుండగఁ జూచుకొనవలెను. ముడుపు లింకను తక్కిన సొమ్ములు యాత్రికులు భద్రముగా గాపాడుకొనవలెను. నమ్మి యితరులకియ్యఁగూడదు.

3. సత్రములు:-

"పుష్పతోట" అనువిశాలమైన దేవస్థానపు సత్రముగలదు. మిగుల శుభ్రముగను, బందోబస్తుగనుండును. ఇచ్చటగుమాస్తా జవానులు (అనగా భంట్రోతులు) గలరు. బసపాత్ర సామానులు