పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/173

ఈ పుట ఆమోదించబడ్డది

128

తిరుమల తిరుపతి యాత్ర

ఇంగ్లీషు ప్రభుత్వము

1801 జూలై 31 తేది మొదలు ఇంగ్లీషుప్రభుత్వమునకు లోబడి ఈ దేవస్థానం ఉన్నది. 1842 జూలై నెల 10 తేదీన శ్రీ మహంతు సేవాదాస్ జీ వారిపేర సన్నదుపుట్టి దేవస్థానములకు విచారణకర్తలుగా ఏర్పడువరకు ఈస్టిండియా కంపెనీ వారే సర్కారు ఉద్యోగస్తులనుంచి దేవస్థానపు వ్యవహారము లను చక్కచేయుచుండిరి. శ్రీహత్తిరాంజీమఠం శ్రీమహంతు సేవాదాస్ జీ వారి కాలమునుండి శిష్యపరంపర ఈ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానమునకున్ను, అందుతో చేరిన యితర చిన్న దేవస్థానములకును విచారణకర్త (Trustee) గా నుండి దేవస్థానపు కార్యనిర్వాహకత్వము జరిపించుచున్నారు.

కలియుగములో స్మరణమాత్రమున ముక్తినిచ్చు శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనము ఈ చిట్టిపొత్తము యాత్రస్తులు చదివినంతట సులభసాధ్యంబయి సమస్తసుఖముల నొసగును.

సంపూర్ణము.