పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/171

ఈ పుట ఆమోదించబడ్డది

126

తిరుమల తిరుపతి యాత్ర

మాత్రం కొండ నెక్క నర్హులగుటచే ఇంగ్లీషు వారి హిందూ సిఫాయిలు యిజారాదార్ సేనయి కలిసి 500 మంది కొండకు వచ్చి పోరాడిరి గాని ఓడిపోయిరి. హైద్రాబాదులో జరిగిన సంగతుల వలన సుభాదార్ సహోదారుడైన బసౌలత్ జంగ్ పద బ్రష్టుడై కొంత సేనతో దేశము దోచుకొనుచు నెల్లూరు ప్రాంతములకు వచ్చి తాను దక్క౯ సుబావల్ల పన్ను వసూల్ చేయుటకు పంపబడెనని చెప్పుచూ నజీబుల్లాఖాన్ కున్ను యింకను అనేక పాళేగార్ల కున్ను, బాకీ యుండు కప్పము చెల్లించ వలసినదిగా బెదిరించుచు జాబులు వ్రాసెను. ఆర్కాడులో ఫ్రెంచి వారితో కలియుటకు వీర్ల రాజ్యములుగుండా తాను పోవలెనని వెల్లడించ వీర్లందరకు మరింత భయకంపిత మాయెను. నజీబుల్లా ఖాన్ యు, పాళెగార్లందరునూ మద్రాసులోని ఇంగ్లీషువారి సహాయము కోరినను తిరుపతి కొండ తిరుగ స్వాధీనము చేసుకొటకు ఇంగ్లీషువారి కొకరయినను సహాయము చేయరైరి. ఇజారాదార్ ఓడిపోయినాడని విని పాలేగార్లు మొదలగు వార్లకు భయము మరింత హెచ్చాయను. నారాయణ శాస్త్రికి సహాయముగా సేన వచ్చుచున్నదనియు అది తిరుపతి ఆక్రమించినంతట వచ్చే ఉత్సవము వల్ల రాబడి ఇంగ్లీషు వారికి చేరదని తెలియగా మదరాసు నుండి మేజర్ కాలియడ్ అను సేనాని సైన్యముతోను మందు, గుండు సాములతోను తిరుపతి వచ్చి కరకంబాడి పాళెగార్లతో పోరాడి ఓడించి గ్రామమున్ను చుట్టుపట్లయున్ను ధ్వంసము చేసి, పాళెగారును చంపెను. తర్వాత తిరుపతికి వచ్చి ఇజారాదారు యొక్క సైన్యమున్ను తన హిందూ సిపాయిలను కొండకు పంపి, నారాయణ శాస్త్రిని మట్ల