పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/168

ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతి యాత్ర.

123

పోయెను. వారి యిష్టానుసారము మనుమడు సుబాకు రావలసి నందుకు నాజర్ జంగ్ అను కుమారుడు సుబాకు రాగా కలతలు ఆరంభమాయెను. మనుమడు ముర్జషాజంగ్ చందా సాహెబుకు సహాయమొనర్చి అతనిని నవాబుగ నిర్మించెను. నాజర్ జంగ్ మహమ్మదల్లీని నబాబు అనెను. ఇంగ్లీషువారి సహాయము వల్ల అనేక యుద్ధములైన తేర్వాత మహమ్మదల్లీ నవాబు ఆయెను. యుద్ధములో ఇంగ్లీషు సేనాని క్లైవు సహాయము వల్ల నాలుగు లక్షల వరహాలు రాబడి వచ్చు రాజ్యము ( అనగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానము రాబడి సహా) మహమ్మదల్లీకి లోబడినది. కర్నాటక యుద్ధములు నిల్చి నిల్చి జరుగు చుండెను. 1753 లో మహమ్మద్ కోమాల్ అను సేనాని అర్కాడులో కలతలవల్ల కావేరిపాకం యుద్దమయిన తర్వాత స్వంతంత్రము వహించి నెల్లూరు ముట్టడించి స్వాధీనము చేసికొనిరి. నెల్లూరులో గవర్నరును నవాబు సవతి సహోదరుడును అయిన నజీబుల్లా నెల్లూరు నుంచి ఆర్కాడుకు పారి పోయిరి. ఈ ప్రకారము సుమారు ఒక వత్సరము మహమ్మదు కోమల్ జయంబొంది ఆర్కాడుకు యాబై మైళ్ల దూరమున నున్న తిరుపతి కొండ మీది ప్రసిద్ధి కెక్కిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్తెహానము, ముట్టడింప ప్రయత్నించి వచ్చెను. అప్పుడు వుత్సవ పడిత రాదులు పోను వర్షమునకు 60 వేల వరహాలు ఆర్కాడు నవాబులకు దేవస్థానమునుండి రాబడి వచ్చు చుండెను. ఈ దేవస్థానమువల్ల వచ్చు రాబడిని కర్నాటక యుద్ధములో అయిన ఖర్చులకు గాను నవాబు మహమ్మదల్లీ 1753 లో ఇంగ్లీషు వారికి