పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/160

ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

115

యోచించగా ఏడు బ్రహ్మోత్సవము లున్నట్టు శాసనమువల్ల తప్పఆచారమువల్ల ఇప్పుడు అగుపడదు. గాని ఇంచుక శ్రద్దతో పరిశీలించినంతట కొంతవరకు ఫలానా మాసములలో బ్రహ్మాత్సవములు జరుగుచుండెనని, తెలియగలదు. అనంతపద్మనాభచతుర్దశినాడు ముక్కోటిద్వాదశిసోడు రధసప్తమినాడు శ్రీస్వామి పుష్కరిణిలో చక్రస్నానము జరుగు అచారముగలదు ఈ చక్ర స్నానమునకు కారణమేమని అనేక వత్సరములు ఎవరిని అడిగినను సరి అయిన సమాధానము రాదాయెను. ఈ శాసనము వల్ల బ్రహ్మోత్సవము పూర్తిఅయిన తర్వాత చక్రస్నానమనీ నేను ఎంచితిని నేను నాయోచన సరియనీ పల్లవ వంశీకుడయినపార్థివేంద్రవర్మ౯ కాలములోనే శాసనమువలన ఏర్పడినది. ఆవర్మ౯ తన 14వ వత్సరపు పాలనములో శ్రీవారికి ధనుర్మాసములో ముక్కోటి ద్వాదశీకి ముందుదినమునకు 2 బ్రహ్మోత్సవములు 7 దినములు జరుగునట్లు నియమించి అందుకు 47604 గుంటలభూమిని ఏర్పాటు చేసిరి. కాలక్రమేణ హిందూ రాజుల పరిపాలనంబు పోయిన తర్వాత కొన్ని బ్రహ్మోత్సవములకు చక్రస్నానంబుమాత్రము మిగిలెను మరికొన్ని బ్రహ్మా త్సవములు రూపులేకపోయెను. రధసప్తమి ముందు బ్రహ్మా తపముమాత్రము 7 ఉత్సవములు చక్రస్నానము ఒకే రోజు జరుగునట్లు ఎర్పడెను.

పూర్వముబ్రహోత్సవానంతరము పడాయతి వుత్సవము గుచున్నట్టు శా 1314 ఆంగీరససంవత్సర శాశసమువలన నందవనములో పూమంటపమునకు శ్రీవార్లు విజయము చేసినట్లు ఏర్పడు