పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/148

ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

103


పహరణము తటాకు సేతు భేత్తారము. పర స్త్రీ సంగలోలుపము, గురు విప్రజనద్వేషము, ఆత్మస్తుతి పరాయణము, అసంస్కృతాన్న భోజనము, పితృశేషాన్న భోజనము, మాతాపితృవిరోధము బోహణుండు దర్భపాణియై ఛండాలునీతో భాషించుట, పితృయజ్ఞ పరి త్యాగము మొదలగువాని వలన దోషములను ఘోణతీర్థస్నాన ముహరించును, ఇందలిస్నానము వలపునరానృత్తి వర్జితమైన వైకుంఠప్రాప్తీగల్లును.

పూర్వకాలములో తుంబురుడను గంధర్వుడు పత్నీ సహితముగ నీతీర్థమువద్దనివసించుచుండెను. తుంబురుడు సర్వవిద్యో విశారదుండు. భార్య సర్వనుగుణసంపన్నురాలు, గంధర్వుడు ప్రీతితో తన భార్యనుబిలిచి ఈమాఘ మాసంబునను దినము. తనతో అరుణోదయమున స్నానము చేసినట్టిల్లు అలికిముగ్గు పెట్టి దేవతానివేదనకు పాకము చక్కగా చేసి తనతో దేవునికి ప్రదక్షణముగావించి అరిషడ్వర్గంబులు వడలి (శ్రీమన్నేరాయుని ధ్యానింపుము. శాశ్వతైశ్వర్యపదము నులభ సాధ్యమగుననీ జెప్ప శీతంబున స్నానంబు సాధ్యంబుకాడను అప్రియ వాక్కులనేకములు బలుకునాగ్రహముగల్లి "శ్లో. పుత్రంచధర్మదిముఖం భార్యాం చాప్రియభాషిణీమ్, అ బహణ్యంచ రాజానాం సద్యశ్నాపేనశోయేత్ || "అనువాక్యము స్ఫురణకు తెచ్చుకొని “నీవు ఘోణతీర్ధమునకు దక్షిణమున నిర్జల ప్రదేశమున పిప్పలివృక్ష శోటరములో మండూకరూపముననుందువుగాక?” అని భార్య నుశపింప నామెపతిఅయిన గంధర్వవల్లభుని పాదములమీదపడి దయకు ప్రార్ధింప “అగస్త్య ఋషి ష్యులతోవచ్చి ఘోణతీర్థములో స్నానముగావించి పిప్పలి వృక్షమువద్ద శిష్యులకు