పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/146

ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

101


అని చెప్పుచు వేంకటాచలమందు వియడ్గగగలడు. ఆ పర్వతమునకేగి అచ్చట సర్వపాపహరమగు శ్రీస్వామిపుష్కరిణిలో సంకల్పపూర్వముగా స్నానమొనర్చి తర్వాత నాకాశగంగ తీర్థములో స్నానము చేసినంతట నీవి రూపము బోవు నయనతడట్లు జేయవికృతరూపము పోయెను.

9.పాపవినాశనము.

ఈ తీర్థము శ్రీస్వామి పుష్కరిణి కుత్తరభాగమున మూడుమైళ్లదూరమున నున్నది. ఇందలి స్నానము ముక్తి దాయకము.

శ్లో.

తత్రస్నా నాన్న రాయన్తి వైకంఠం సోత్రసంశయః॥

ఈ తీర్థమునకు ముక్కోటి అగు ఆశ్వయుజ శుద్ధసప్తమి ఉత్తరాషాఢ నక్షత్రముతో కూడిన ఆదివారము నొడు గానీ, ఉత్తరాభాద్ర నక్షత్రయుక్తమైన ద్వాదశినాడుగాని స్నానముమిగుల శ్రేష్ఠము.

శ్లో.

ఆశ్వయుక్చుక్ల పక్షాచప ప్తమ్యాంభానువాసరె.॥


శ్లో.

ఉత్తరాషాఢాయుక్తాయాం తథాపాపవినాశనమ్.।
ఉత్తరాభాద్రాయుక్తాయాంద్వాదశ్యాంవాసమాగమ॥


శ్లో.

సాలగ్రామశిలాందత్వా స్నాత్వాచవిధిపూర్వకమ్,।
ముచ్యతేసర్వపానైశ్చ జన్మకోటిశదవైః.॥