పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/129

ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

87

మద్బుతముగా చెప్పబడినది. గ్రంధబాహళ్యమగునని స్వల్పము నిందు చెప్పబడినది.

శ్రీస్వామి పుష్కరిణి గంగాది మొదలగు సర్వతీర్ధములకు జన్మభూమనియు, పంచమహపాతకములు పోగొట్టినదియు, స్నానమాత్రమున నై హికాముష్మికములు నిచ్చునదియునుగ వైకల్య దోషములను బోగొట్టునదియు, వైకంఠముునుండీ మహావిష్ణు అమవార్లసహా క్రీడార్ధం శ్రీస్వామిపుష్కరిణి తీర్ధమునకువచ్చి నారనియు మొదలగు మహిమవర్ణింపబడినది.

శ్లో. స్వామి పుష్కరిణీ పుణ్యా సర్వపాపప్రణాశిని|
వైకుంఠె భగవత్క్రిడా వాపశ్రీ భూమిలా||

 

శ్లో. అపాకృతజకాఘచనుగన్ధా సుమనోహరా|
గజ్ఞాదిసర్వతీర్ధానాం జన్మభూమి శ్శుభోదకా||

 

శ్లో. ఆనీతా నైనతేయేన క్రీడార్ధం తత్ర తిష్టతి|
విరఃకొవడ్రజోదోష ప్రముఖాఘవినాశిని||

వరాహపురాణం

ఈ తీర్థములో మధ్యగనొక చక్కని రాతిమంటపము గలద.అందు దశావతారములు శిలలోబాగాశిల్పము దయబడినవి. ఈమంటపము నాలుగు వత్సరముల క్రిందట జీర్ణోధారము జేయబడినది.

ఈ తీర్షము శ్రీవారి దేవస్థానమునకుత్తరభాగమున ప్రాకారమునకు మూడుగజములదూరమున నున్నది. యాత్రి కులందఱు నిండు స్నానము చేసి శ్రీవారి దర్శనముగావించెదరు.

ధనుర్మాసములో శుక్లపక్షద్వాదశి అరుణోదయము ఈ తీర్థమునకు ముక్కోటి. శ్రీవారి దేనస్థానంనుండి చక్రతాళ్వార్