పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/118

ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

81

మార్గమున గూడ దేవస్థానపుభటులు గలరు. చలిపందిరిన్ని గలదు.

9. తిరుమల అంగడివాండ్రు.

వీరిలోన నేకుల స్వాధీనములో బాడుగ ఇండ్లు గలవు. వీరు యాత్రికులకు నిండ్లు బాడుగ కిచ్చెదరు. శ్రీవారికి కర్పూరము ఖరీదుచేసి కొప్పెరలో వేయమనెడి దుర్భోధనలు వినక యాత్రికులు తమా ప్రార్థనల ప్రకారము నడుచు కొనవలెను.

10 కోతులు.

తిరుమలలోను తిరుపతిలోను కోతులుగలవు. తిరుమల మీదమెండు. కోతులు అరటిపండ్లు టెంకాయముక్కలు మొదలగుతినుబండారవస్తువులు చూచునప్పుడు మనుష్యులకు అడ్డ మువచ్చును వాటినిచ్చి వేయన లెను. లేనంతట కనబడకుండా నుంచుకొనవలెను. నిర్ణేతువుగా కోతులు ఎవరికిన్నిహానిచేయ కసంచరించుచుండును.

11. శాసనములు.

దేవస్థానపు ప్రాకారములమీదననేక శాసనములుగలవు. ఇదిగాక తాళపాకము వారికృతులు రాగి శాసనములుగనున్నవి.

12. భావులు తులసి పుష్పం.

విరజానది అనునొక చిన్న భావి ఆకారముగలదిసం వగ ప్రాకారములోగలదు. శ్రీవారిపాదములక్రింద ప్రవహించు ఒక్కనది అగు విరజయొక్క తీర్థము ఈచిన్నభావి గుండ నరులకు ప్రాప్త మనిన్ని చెప్పెదరు.

శ్రీవారికి సమర్పణ అయినపుష్పము తులసి ఎవరున్ను ధరించు కొనగూడదు. ఈతులసిపుష్పము తిరుచానూరు పంచ

6