పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/114

ఈ పుట ఆమోదించబడ్డది

తీరుమల తిరుపతియాత్ర.

77


ఈ కాయ పచ్చడికీ రు 5-0-0 లు ఇయ్యవలెను. కాయలు గృహస్థు ఇయ్యవలెను. ఒక గూనపచ్చడి ఆరగింపు చేయించి ఇచ్చెదరు.

పైనఁ జెప్పిన ప్రసాదములను నీవేద న చేయించుటకు 'శ క్తి లేని యాత్రికులు కలకండ, కొబ్బెర, ముంతమామిడి పప్పు, బాదంపప్పు మొదలగునవి కొని ఆదినుసులఖరీదు మొత్త మునకు సరిగ దేవస్థానం పారుపత్యదారికి ఖచేరిలో చెల్లించి రసీదుతీసుకొని బంగారువాకిలి వద్దనున్న బ్రాహ్మణునీ వశములో నిచ్చినంతట నివేదన చేయించి ప్రసాదమిచ్చును. ఎంత ఎక్కువవిలువ అయినను రు 0-4-0 తక్కువ సుంకము వసూలు చేయరు. శ్రీవారి అఖండములో నెయ్యి వేయుటకున్ను, నగలు వస్తములు మొదలగునవి సమర్పణ చేయుటకున్ను ఇదేపద్దతి గమనించవ లెను..

యాత్రికులు తమ బసలయందు శుభకార్యములు చేయునపుడు వాద్యము కావలసినంతట రు 1_8_0 పారుపత్య దార్ ఖచేరిలో చెల్లించినంతట మేళమునకు టిక్కెట్ ఇచ్చెదరు. అది మేళగాండ్రకు చూపించి బసయున్ను, మేళముకావ లసిన కాలమున్ను చెప్పినంతట వాండ్లువచ్చి మేళమువాయించి టిక్కెట్ వాపసుపుచ్చుకొనెదరు, ఒకేదివసమున అనేక యాత్రి కులు మేళమునకు సొమ్ము చెల్లించినంతట నందఱుకు ముహూర్త సమయమునకు మేళమువచ్చుట అసాధ్యముగనుక కొంచెము హెచ్చుతగ్గు కాలములో వచ్చి వాయిం చెదరు. మేళమునకు సొమ్ముచెల్లించిన వారిలోఁ గొందఱు తమకు ఘంటలకొలఁది. మేళము పోయించమని కో రెదరు. అట్లు చేసినయెడల మేళ