పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/112

ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

75

అర తిరుప్పావడ.

పూరాతిరుపావడవలెనె జరుగును గాని కుంభమునకు మాత్రము సగము సామానులుపడును.

కోవిలాళ్వార్ తిరుమంజనము

తెల్లవారుసరికి మొదటిఘంటయి లోపల అఖండము లుంచు శమ్మలు మొ|| బయటకుఁదీసి శుద్ధిచేసి గోడలు, పై కప్పు మొదలగువానికి కుంకుమ, కర్పూరము చందనము మొదలగునవి కలపి పూయుదురు. తెఱువాత రెండవఘంట నాలుగు ఘంటలకయి గృహస్థుకు వస్త్ర బహుమానముయి వాద్యములతో వెళ్లినపిదప ధర్మదర్శన మారంభమగును.

సహస్రలాశాభిషేకము.

శ్రీవారి మొదటిఘంట ఉయము 8-ఘంటలకు అయిన తఱువాత వెయ్యిన్ని యెనిమిది వెండి చెంబులతో మంత్రవత్ హోమయుక్తముగా అభిషేకము జరుగును. శ్రీవారి రంగ మంటపములో శ్రీభోగశ్రీనివాసమార్తివారు, శ్రీఉత్సవరులు శ్రీసేనాధిపతి వారికి అభిషేకము జరుగును. శ్రీభోగ శ్రీనిహాస మూర్తివారికి, శ్రీమూలవరులకుపట్టసూత్రముచేత సంబంధము గలిగియుండును. శ్రీభోగశ్రీనివాసమూర్తి వారు ఈసహస్ర కలశాభిషేకమునకు మాత్రము బంగారువాకిలిదాటివచ్చెదరు.


అధ్యాయము VII.

1. ఆర్టీతనివేదన.

ఇది చెరువులు, పళ్లు అని ద్వివిధంబులు