పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/101

ఈ పుట ఆమోదించబడ్డది

66

తిరుమల తిరుపతియాత్ర.

వారు కొంతమంది ఉద్యోగస్థులతో నిచ్చటనె ఖచేరిచేసి దరు. నవరాత్రోత్సవములో తిరుమలరాయ మంటపములో గాక రంగనాయక మంటపములో నాస్థానము ప్రతిసారియ జరుగును.

7. ధనుర్మాసము.

ధనుర్మకరసంక్రమణముల మధ్యకాలమునకు ధనుర్మాసమని పేరు. ఈ నెలదివసములు సుప్రభాతశ్లోకములు చెప్పరు, ద్రవిడ ప్రబంధము పఠించుచు బంగారువాకిలి తీయుదురు. వెంటనె తోమాలసేవ, బిల్వార్చనయి నివేదనఘంట అవును. అనంతరము శుక్రవారముదయమునఁ దప్ప ధర్మదర్శనమయి నివేదనయిన ప్రసాదములు అనఁగా శనగపప్పు, బెల్లపు నేతి దోశలు, పొంగలి, చక్కెరపొంగలి, పండ్లు మొదలగునవి శ్రీభాష్య కారులవారి ముఖ మంటపములో స్థానబహుమాన పూర్వముగా గోష్టి వినియోగమవును. ఈతోమాల శేవ, అర్చన బహిరంగముగాదు.

ధనుర్మాసపూజలో తోమాల సేవ, అర్చన రహస్యము గాన నెవరు పోఁగూడదు. బ్రాహ్మణే తరులకు వాపక్షమైనను లేదు. ధనుర్మాసపుఘంట దర్శనమయిన తఱువాత తలుపులు వేయబడి 9 A M. ఘంటలకు తిరుగ తెరచి ధర్మ దర్శనము లేక నేతోమాల సేవ మొదలగునవి మామూలు ప్రకారము జరుగును. ఈమాసమున రాత్రి శయనమునకు శ్రీకృష్ణస్వామి వారు దయచే సెదరు.

శ్రీవారి ధనుర్మాసములోని శుద్ధఏకాదశికి "ముక్కోటి ఏకాదశి" అని పేరు. ఈదివసమున శ్రీవారి వైకుంఠప్రాకారము