పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/446

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0188-03 చాయానాట సం: 02-446 దశావతారములు

పల్లవి:

కమ్మంటేఁ గావా కాఁగల వన్నియు
చిమ్ముల మాయలు సేయఁగనేలా

చ. 1:

సరసిజాక్ష నీసంకల్పమాత్రము
అరుదగు ఘనబ్రహ్మాండ మిది
అరయఁగ ధరలో నల్పపుఁ బనులకు
హరి యవతారం బందితివేలా

చ. 2:

సతత సురాసుర జననమరణములు
మతి నీహుంకారమాత్రములు
గతియై యమృతము గల్పించుకొరకును
తతి ఘోరజలధి దచ్చితివేలా

చ. 3:

యి వైకుంఠము యీశేషగిరే
మహి నీ దర్శనమాత్ర మిది
విహరింపఁగ శ్రీవేంకటేశ యిటు
బహులోకపుకల్పన లవి యేలా