పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/431

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0185-06 గుండక్రియ సం: 02-431 నామ సంకీర్తన

పల్లవి:

జయమంగళము నీకు సర్వేశ్వరా
జయమంగళము నీకు జలజవాసినికి

చ. 1:

శరణాగతపారిజాతమా
పొరి నసురలపాలి భూతమా
అరుదయున సృష్టికి నాదిమూలమా వో-
హరి నమో పరమపుటాలవాలమా

చ. 2:
సకలదేవతాచక్రవర్తి
వెకలివై నిండిన విశ్వమూర్తి
అకలంకమైన దయానిధి
వికచముఖ నమో విధికి విధి

చ. 3:

కొలచినవారల కొంగుపైఁడి
ములిగినవారికి మొనవాఁడి
కలిగిన శ్రీవేంకటరాయా
మలసి దాసులమైన మాకు విధేయా