పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/401

ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0180-05 మంగళకౌశిక సం: 02-401 సంస్కృత కీర్తనలు

పల్లవి:

తే శరణ మహం తే శరణ మహం
శైశవకృష్ణ తే శరణం గతో౽స్మి

చ. 1:

దశవిధావతార ధర్మరక్షకమూర్తి
దశమస్తకాసురదశన
దశదిశాపరిపూర్ణ తపనీయస్వరూప
దశావరణ లోకతత్వాతీత

చ. 2:

సహస్రలోచన సంతతవినుత
సహస్రముఖశేషశయనా
సహస్రకరకోటిసంపూర్ణతేజా
సహస్రారదివ్యచక్రాయుధా

చ. 3:

అనంతచరణ సర్వాధారాధేయ
అనంతకరదివ్యాయుధా
అనంతనిజకల్యాణగుణార్ణవ
అనంత శ్రీవేంకటాద్రినివాసా