పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/396

ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0179-05 బౌళి సం: 02-396 శరణాగతి

పల్లవి:

జలజనాభ హరి జయ జయ
యిల మానేరము లెంచకువయ్యా

చ. 1:

బహుముఖముల నీప్రపంచము
సహజగుణంబుల చంచలము
మహిమల నీ విది మరి దిగవిడువవు
విహరణ జీవులు విడువఁగఁగలరా

చ. 2:

పలునటనల యీప్రకృతి యిది
తెలియఁగఁ గడునింద్రియవశము
కలిసి నీ వందే కాఁపురము
మలినపు జీవులు మానఁగఁగలరా

చ. 3:

యిరవుగ శ్రీవేంకటేశుఁడ నీమాయ
మరలుచ నీవే సమర్థుఁడవు
శరణనుటకే నే శక్తుఁడను
పరు లెవ్వరైనాఁ బాపఁగఁగలరా