పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/391

ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0178-06 బౌళి సం: 02-391 నామ సంకీర్తన

పల్లవి:

గరుడగమన గరుడధ్వజ
నరహరి నమో నమో నమో

చ. 1:

కమలాపతి కమలనాభా
కమలజ జన్మకారణిక
కమలనయన కమలాప్తకుల
నమో నమో హరి నమో నమో

చ. 2:

జలధిబంధన జలధిశయన
జలనిధిమధ్య జంతుకల
జలధిజామాత జలధిగంభీర
హలధర నమో హరి నమో

చ. 3:

ఘనదివ్యరూప ఘనమహిమా౦క
ఘనఘనాఘనకాయవర్ణ
అనఘ శ్రీవేంకటాధిప తేహం
అనుపమ నమో హరి నమో