పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/292

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0160-05 శ్రీరాగం సం: 02-291 అధ్యాత్మ శృంగారము

పల్లవి: ఎంతలేదు నీబత్తి యెరఁగరా యిందరును
దొంతిఁబెట్టేవు ప్రియాలు దొరకుదాఁకాను

చ. 1: పొరుగాపెపై వలపు పూనేవు నామీఁద
వరుసల వద్ది కాపె వచ్చుదాఁకాను
సరుస నావంక నీవు చక్కఁ జూచే వప్పటిని
అరసి యవ్వలిపొందు అదనౌదాఁకాను

చ. 2: కడవారిపొందు నాతోఁ గసి వుచ్చు‌కొనే విట్టే
అడరి వారితో మాఁట లందుదాఁకాను
నడుమ నవ్వులెల్లాను నవ్వేవు యీవేళను
వుడివోనియట్టి కాఁగి లొనరుదాఁకాను

చ. 3: పోరచి వనితమారు పొదిగేవు నన్ను నిట్టే
చేరి యాపె నిన్నుఁ గూడి చెలఁగుదాఁకా
యీరీతి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
కోరికె లన్నియునుఁ జేకూరుదాఁకాను