పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/482

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0381-1 ఆహిరి సంపుటం: 11-481

పల్లవి: చే పట్టి పిలువరమ్మ చెలులారా
         వే వేగఁ దా రాకున్న వేసరరా లోకులు

చ. 1: వెదకి కాకన నే విరహన నుండఁ గాను
       పొదిగి తానే వచ్చుట పుణ్యము గాదా
       మదిలో నేఁ దలఁచగ మరఁగున దా నుంటే
       వదలక దయ లేనివాఁ డనరా లోకులు

చ. 2: తలఁచి తనకుఁ గాను తమకాన నుండఁ గాను
       మలసి తాఁ బైకొంటే మంచిది గాదా
       వలచినవారి నింత వలలఁ బెట్టఁగఁ బోతే
       అలరి యెం తపకీర్తి యనరా లోకులు

చ. 3: తన పేరు నాలికపైఁ దడవుచు నుండఁ గాను
       తనియఁ బొందుట జాణతనము గాదా
       యెననె శ్రీవెంకటేశుఁ డిదివో నన్ను రతుల
       పొనిగి యానోళ్లనే పొగడరా లోకులూ