పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/342

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0357-5 ఆహిరి సంపుటం: 11-341

పల్లవి: ఎందు కైన వచ్చు నీయిటువంటి భావములు
         విందుగా నాతో నాడవే వింటా నున్నాఁ డాతడు

చ. 1: చెక్కునఁ బెట్టేవు చేయి సిగ్గుకో చింతకో కాని
       తక్కక నేపతిసుద్ది దడవితేను
       పక్కన నవ్వే వందుకు పగటో నీ పల్లదమో
       వొక్కమాటె ఆన తేవే వొద నున్నాఁ డాతఁడు

చ. 2: తప్పక చూచే వదేమే తగలమో కోపమో
       చిప్పిల నాతని నీ చేతి కియ్యఁగా
       కుప్పేవు పయ్యదకొంగు కసరులో కొసరులో
       వొప్పుగా నాకుఁ జెప్పవే వూరకున్నాఁ డాతఁడు

చ. 3: పవ్వళించే యేమే నీ పంతనాలో పొంతనాలో
       యివ్వల శ్రీవెంకటేశుఁడెడ మియ్యఁగా
       దవ్వుల నుండిననన్ను దగ్గరఁ బిలిచే వేమే
       నివ్వటిల్ల నాన తీవే నిన్నుఁ గూడె నతఁడు