పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/568

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0195- 5 భైరవి సంపుటం: 07-566

పల్లవి:
అల్లదివో నిలుచుక ఆతఁడున్నాఁడు
తెల్లమిగా నిన్నుఁగూర్చే తెలుసుకోరాదా

చ.1:
అదనెరిఁగి మాటాడేనాతని నీడకుఁ దెచ్చే
సుదతి నానేరుపెల్లఁ జూడరాదా
కొదలెల్లఁ దీరవలెే గురుతులు గావలె
చదరుఁదనము నీవు సంతోసించరాదా

చ.2:
తలఁపెల్ల బ్రమయించే తరి తీపు వుట్టించే
మెలుఁతరో నీవు నన్ను మెచ్చరాదా
సెలవుల నవ్వించే చేతికి లోనుగాఁ జేసే
సెలవు నాకిదె నేఁడు చిత్తగించరాదా

చ.3:
ఆసలెల్లఁ బుట్టించే నలవాట్లెల్లఁ జేసే
చేసన్నకు లోనుసేసేఁ జేపట్టరాదా
యీసరికి శ్రీవేంకటేశుడట్టె విచ్చేసి
రాసికెక్క నినుఁగూడె రాజ్యమేలరాదా