పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/556

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0193-6 కొండమలహరి సంపుటం: 07-554

పల్లవి:
ఎంత చెప్పినా నెరఁగదేమి సేతమే
సంతోసాన చెలులెల్లా సాకిరిగా వినరే

చ.1:
నిన్నటివలపుగాఁగ నేఁడ పెంచీఁగాక
యెన్నికగలదియైతే నెమ్మెసేసునా
వన్నెకెక్కిన తుమ్మెదవంటివాఁడు మగవాఁడు
అన్నిటా నాతనిమనసంత నమ్మెనా

చ.2:
కొత్త మాట పట్టుగాఁగ కొంగువట్టి తీసెఁగాక
అత్తి సడిసన్నదైతే నంత మీరునా
మెత్తని పండు వంటిది మించిన పతి చిత్తము
వొత్తి పిసుకఁగఁబోతే వోరువఁగద్దా

చ.3:
సరి వయసులుగాఁగ సాముతోఁ బెనఁగీఁగాక
వొరయ వచ్చినదైతే వోరుచుకోదా
యిరవై శ్రీవెంకటేశుఁడేనుగవంటివాఁడు
అరసి కలసెనిఁక నడ్డమున్నదా