పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/376

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0163-6 కేదారగౌళ సంపుటం: 07-374

పల్లవి:
చిత్తగించు నీవీకెకు సింగారము
బత్తిసేసెనాపె నీకుఁ బాయనిసింగారము

చ.1:
చెలియ మోమునకును చిరునవ్వు సింగారము
చిలుకుఁ జూపు కన్నుల సింగారము
కలితంపుఁజెక్కులకు కళలు సింగారము
లలిమీర నొసలి కలకలు సింగారము

చ.2:
ఉన్నతపు చన్నులకు నొరపు సింగారము
చిన్ననడిమికి నారు సింగారము
అన్నువ చేతులకు నొయ్యారి గోళ్ళే సింగారము
తిన్ననిమెడకు సోగతీరు సింగారము

చ.3:
నవకపుఁబాదాలకు నడపు సింగారము
చివురుమోవికి మించు సింగారము
తివిరి శ్రీ వేంకటేశ తెరవఁగూడితి విట్టే
సవరనిమేనికందచందమే సింగారము