పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/136

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0123-3 కేదారగౌళ సంపుటం: 07-135

పల్లవి:
ఓరుచుకోవే యెట్టయినా వువిద నీవు
నేరుపరి నీవిభుందు నేఁడే వచ్చీనీడకు

చ.1:
కలువల వేసితేలే కాముఁడు చుట్టము గాఁడా
వెలయు విరహులకు వెగటుగాక
చలివెన్నెల గాసితే చందురుఁడు పగవాఁడా
పాలయలుకలవారే పాగడరుగాక

చ.2:
కొసరుచుఁ బాడితేనే కోయిలగుండెబెదరా
అసు (స) దు విరహులు కాదందురుగాక
ముసరితేఁ దుమ్మిదమూఁకలు దయలేనివా
విసిగిన కాముకులె వినలేరుగాక

చ.3:
వనము సింగారించితే వసంతుఁడు క్రూరుఁడా
వొనరని విరహులకొంటదుగాక
యెనసి శ్రీ వెంకటేశుఁడేలె నిన్ను చిలుకలు
కినిసేవా పాంథులకు కేరడముగాక