ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0249-3 కొండమలహరి సంపుటం: 08-291
పల్లవి:
అమ్మరొ యెంతగడుసరి వదేమె నీవు వల
పమ్మకతొల్లె కొనేవు అదేమె నీవూ
చ. 1:
మలసి విభుఁడు నీతో మాటలాడకతొల్లె
అలిగి యెగ్గులువట్టే వదేమె నీవూ
కలసి యాతఁడు నిన్నుఁ గరఁగించకతొల్లె
అలసి వుస్సురనేవు అదేమె నీవూ
చ. 2:
చక్కఁగాను నీపతి సరసమాడకతొల్లె
అక్కడజీరె ననేవు అదేమె నీవు
తక్కక యాతఁడు నీకు తమ్ముల మిడకతొల్లె
అక్కట కారమనేవు అదేమె నీవూ
చ. 3:
యెనసె శ్రీవెంకటేశుఁ డిప్పుడు యింతకతొల్లె
అనుకొనే వాలనంటా నదేమె నీవూ
చెనకితి వితఁడు ఫైఁ జేయి చాఁచకతొల్లె
అనలుఁగొనలకెక్కే వదేమె నీవూ