ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0041-6 ముఖారి సంపుటం: 06-177
పల్లవి:
బయలీఁదించకురే పలుమరు యీ
ప్రియునిపేర నిందరినిఁ బిలిచీఁ జెలియా
చ. 1:
తడవి తవ్వకురే తమకపుఁజెలమ
వుడుకుచు నువ్విళ్లూరీని
పుడికి పెంచకురే పులకల నారూ
వొడలి బడలికల నొరగీఁ జెలియా
చ. 2:
దరికొలుపకురే తలపోఁతదాలి
కరసాన కాఁకలఁ గనలీని
పురికొలుపకురే పుక్కిటి వూరుపూలూ
శిరసు నొప్పుల చేతఁ జిమిడీఁ జెలియా
చ. 3:
మంతన మాడకురే మతిలోని యలపులు
వంతలనే వదనము వంచీని
చెంతల విసరరె శ్రీ వేంకటపతి
సంతపు లేఁజెమటల జడిసీఁ జెలియా