పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/176

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0041-5 ఆహిరి సంపుటం: 06-176

పల్లవి:

వోవలఁబుచ్చే వూరకిటు
నీవలె సొలయఁగ నేరర నేను

చ. 1:

తీపులఁ బొదిగిన తేనెల యలుగుల
చూపు చల్లకువే సుదతి
ఏపున నీకిపు డెదురులు చూచిన
చూపుల నేమిటిఁ జూతుర నేను

చ. 2:

చంచలబరచి చక్కని వదనము
వంచి నవ్వకువే వనిత
నించిన కాన్కల నినుఁ గని వదనము
వంచి నవ్వ నిట్టు వలదా నేను

చ. 3:

తాలిమి హృదయము తల్లడ మంది
కాలు దొక్కకువే కలికి
జాలి వేంకటేశ్వర కౌఁగిట నిను
కాలు దాఁకె నేఁకటఁ బడ నేను