పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/134

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0034-5 పాడి సంపుటం: 06-134

పల్లవి:

చింతచేఁ జిత్తంబు చిక్కువడిన ట్లాయ
కాంతక్రొవ్విరుల సింగారంపుఁ దురుము

చ. 1:

చెలినుదుట మరుఁడు వ్రాసిన వ్రాఁతవలె నాయ
సొలపునను జెదరుంగస్తూరి పట్టు
జలజ లోచన గుండె జల్లనిన యట్లా య
పులక జొంపముల మెఱుపుల చన్నుదోయి

చ. 2:

వనిత వలపుల జలధి వడి మునిఁగినట్లాయ
కొన మిగిలి జారు చెక్కుల చెమటలు
మనసి జాగ్నుల పొగలు మతి నెగసిన ట్లాయ
తనివోని నిట్టూర్పు తాపంబు గాలి

చ. 3:

కాంత పరిణత(తు)లు లెక్కలు వెట్టినట్లాయ
కంతు నునురేఖ లంగనమేనను
అంతరంగమున విభుఁడలముకొనిన ట్లాయ
సంతసపు వేంకటేశ్వరుపొందు చెలికి