పుట:తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007.pdf/9

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7/G28


(3) ఏదేని ప్రాంతమునకు రెండు లేదా అంతకంటే ఎక్కువ ట్రిబ్యునళ్లు సంఘటిత పరచబడినపుడు, రాజ్య ప్రభుత్వము సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వు ద్వారా వాటి మధ్య కార్యకలాపాల పంపిణీ ప్రక్రియను క్రమబద్ధము చేయవచ్చును.

విచారణ విషయములో సంక్షిప్త ప్రక్రియ.

8.(1) 5వ పరిచ్ఛేదము క్రింద ఏదేని విచారణను చేయునపుడు, ట్రిబ్యునలు, ఈ విషయములో రాజ్య ప్రభుత్వముచే విహితపరచబడునట్టి ఏవేని నియమములకు అధ్యదీనమై, తాను సముచితమని భావించునట్టి సంక్షిప్త ప్రక్రియను అనుసరించవచ్చును

1974 లోని 2అ వది.(2) ట్రిబ్యునలు, ప్రమాణము పై సాక్ష్యము స్వీకరించుటకు మరియు సాక్ష్యులనుహాజరగునట్లు చూచుటబలవంతముగా దస్తావేజులు వాస్తవ విషయములను వెల్లడి చేసి మరియు సమర్పించు నిమిత్తము మరియు విహితపరచబడునట్టి ఇతర ప్రయోజనముల కొరకు సివిలు న్యాయ స్థానము యొక్క అన్ని అధికారములను కలిగిఉండవలెను; మరియు క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 195వ పరిచ్ఛేదముమరియు అధ్యాయము 26 యొక్క ప్రయోజన ములు అన్నింటి కొరకు ట్రిబ్యునలుసివిలు న్యాయస్థానముగా భావించబడవలెను.

(3) ఈ విషయములో చేయబడు ఏదేని నియమమునకు అధ్యధీనమై ట్రిబ్యునలు భరణ పోషణము కొరకైన ఏదేని క్లెయిమును న్యాయ నిర్ణయము చేసి మరియు దాని పై నిర్ణయించు నిమిత్తము విచారణ జరుపుటలో దానికి సహాయపడుటకుగాను, విచారణకు సంబంధించిన ఏదేని విషయములో ప్రత్యేక పరిజ్ఞానము కలిగి ఉన్న ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను ఎంపిక చేసుకొనవచ్చును.

భరణపోషణ కొరకైనఉత్తర్వు.

9.(1) తనకు తానుగా పోషించుకోలేని వయోవృద్ధ పౌరుడిని పోషించుటకు సంతానము లేదా సందర్భానుసారము బంధువులు ఉపేక్షించిన లేదా నిరాకరించిన యెడల, మరియు ఆ విషయములో అట్టి ఉపేక్ష లేదా నిరాకరణ జరిగినదని ట్రిబ్యునలు సంతృప్తి చెందిన యెడల, తాను సముచితమని భావించునట్టి విధముగా అట్టి వయోవృద్ధ పౌరుని భరణపోషణ నిమిత్తము నెలవారీ రేటు చొప్పున నెలసరి బత్తెము చెల్లింపు కొరకును ఉత్తర్వు చేయవచ్చును మరియు ఆయాసమయములందు తాను ఆదేశించునట్టి రీతిలో అట్టి వయోవృద్ధ పౌరునికి దానిని చెల్లించమని అట్టి సంతానము లేదా బంధువులను ట్రిబ్యునలు ఆదేశించవచ్చును.

(2) రాజ్య ప్రభుత్వము విహితపరచునట్టి విధముగా అట్టి ట్రిబ్యునలు చే. ఉత్తర్వు చేయబడు గరిష్ఠ భరణపోషణ బత్తెము నెలకు పదివేల రూపాయలకు మించనట్టి విధంగా ఉండవలెను.