పుట:తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007.pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6/G27


(4) ఎవరికి వ్యతిరేకముగా భరణపోషణము చెల్లింపు నిమిత్తము ఉత్తర్వు చేయుటకు ప్రతిపాదించబడినదో ఆ సంతానము లేదా బంధువు సమక్షమున అట్టి దావా చర్యలకు సంబంధించిన సాక్ష్యమునంతను తీసుకొనవలెను మరియు సమనుల కేసులను విహితపరచబడిన రీతిలో రికార్డు చేయవలెను:

అయితే, ఎవరికి వ్యతి రేకముగా భరణపోషణము చెల్లింపు నిమిత్తము ఉత్తర్వు చేయుటకు ప్రతిపాదించబడినదో ఆ సంతానము లేదా బంధువు ఉద్దేశపూర్వకముగా దానిని తీసుకొనుటకు తప్పించుకొనుచున్నారని లేదా ట్రిబ్యునలు సమక్షమున హాజరగుటకు ఉద్దేశపూర్వకముగానే నిర్లక్ష్యము చేస్తున్నట్లు ట్రిబ్యునలు సంతృప్తి చెందిన యెడల, అది విచారణ జరిపి, ఏకపక్షీయంగా నిర్ధారించవచ్చును.

(5) సంతానము లేదా బంధువు భారత దేశమునకు వెలుపల నివసిస్తున్న యెడల, కేంద్రప్రభుత్వము అధికార రాజపత్రములో అధిసూచన ద్వారా ఈ విషయములో నిర్దిష్ట పరచునట్టి ప్రాధికారి ద్వారా ట్రిబ్యునలుచే సమనులను అంద చేయించవలెను.

(6) ట్రిబ్యునలు, 5వ పరిచ్ఛేదము క్రింద దరఖాస్తును ఆకర్ణించుటకు ముందు, దానిని సంధాన అధికారికి నిర్దేశించవలెను. అట్టి సంధాన అధికారి, తన విచారణాంశములను ఒకనెల లోపల సమర్పించవలెను మరియు సామరస్య పూర్వకమైన పరిష్కారము కుదిరినట్లయితే, ఆ మేరకు ట్రిబ్యునలు ఉత్తర్వు జారీచేయవచ్చును.

విశదీకరణ:- ఈ ఉప-పరిచ్ఛేదము నిమిత్తము, “సంధాన అధికారి”అనగా 5వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)కి గల విశదీకరణలో నిర్దేశించబడిన ఎవరేని వ్యక్తి లేదా వ్యవస్థ యొక్క ప్రతినిధి లేదా 18వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రాజ్య ప్రభుత్వముచే పదాభిదానము చేయబడిన భరణ పోషణాధికారులు లేదా ఈ ప్రయోజనము కొరకు ట్రిబ్యునలుచే నామనిర్దేశము చేయబడిన ఎవరేని ఇతర వ్యక్తి అని అర్ధము.

భరణ పోషణ ట్రిబ్యునలు యొక్క సంఘటన.7.(1) రాజ్య ప్రభుత్వము, ఈ చట్టము ప్రారంభమైన తేదీ నుండి ఆరుమాసముల కాలావధిలోపల, అధికార రాజపత్రములో అధిసూచన ద్వారా, 5వ సరిచ్ఛేదము క్రింద న్యాయ నిర్ణయము చేయుటకు మరియు భరణపోషణము కొరకైన ఉత్తర్వు పై నిర్ణయము చేయు నిమిత్తము అధి సూచనలో నిర్ధిష్టపరచబడునట్లుగా ప్రతి సబ్ డివిజనుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ట్రిబ్యునళ్లను సంఘటితపరచవచ్చును.

రాజ్య సబ్-డివిజనల్ అధికారి హోదాకు తక్కువకాని అధికారి ట్రిబ్యునలుకు అధ్యక్షత వహించవలెను.