పుట:తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007.pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5/G26


(7) భరణపోషణము కొరకైన అట్టి బత్తెమును మరియు దావా ఖర్చులను ఉత్తర్వు తేదీ నుండి గాని లేదా సందర్భానుసారము భరణపోషణము మరియు దావా చర్యల ఖర్చుల కొరకైన దరఖాస్తు తేదీ నుండి గాని చెల్లించవలసి ఉంటుందని ఉత్తర్వు చేయబడిన సందర్భములో, అప్పటి నుండి చెల్లించవలసి ఉండును.

(8) ఆ విధముగా చేయబడిన ఉత్తర్వును సంతానము లేదా బంధువు తగిన కారణము లేకుండానే సదరు ఉత్తర్వును పాటించని యెడల, ఏదేని అట్టి ట్రిబ్యునలు, ఉత్తర్వు యొక్క ప్రతి ఉల్లంఘనకుగాను జరిమానాలు విధించడానికి నిబంధించబడిన రీతిలో బకాయిపడిన మొత్తమునకు జరిమానా విధించేందుకు వారంటు జారీ చేయవచ్చును. మరియు భరణపోషణము మరియు దావా చర్యల ఖర్చుల కైన ప్రతి నెలసరి బత్తెము మొత్తమునకు లేదా సందర్భానుసారము అందులోని ఏదేని భాగమునకు అట్టి వ్యక్తిని దండించవచ్చును. మరియు వారంటు రీచేసిన మీదట బకాయిపడిన మిగిలిన పైకమునకుగాను ఒక మాసమునకు విస్తరించగల కాలావధికి కారావాసముతో లేదా ఒకవేళ చెల్లింపు త్వరగా చేసిన యెడల అంతవరకు, వీటిలో ఏది ముందు అయితే అంతవరకు, ఆతనికి కారావాస శిక్ష విధించవచ్చును: అయితే, ఈ పరిచ్ఛేదము క్రింద బకాయిపడిన ఏదేని పైకమును తిరిగి వసూలు చేయుట కొరకు బకాయిపడిన తేదీ నుండి మూడు మాసముల లోపల అట్టి పైకమును విధించు నిమిత్తము ట్రిబ్యునలుకు దరఖాస్తు చేసిన నేతప్ప ఎట్టి వారంటు జారీచేయబడరాదు. అధికారితో పరిధి మరియు ప్రక్రియ.

6.(1) 5వ పరిచ్ఛేదము క్రింద ఎవరేని సంతానము లేదా బంధువుపై, ఏ జిల్లాలోనైననూ, (ఎ) అతను నివసించుచున్న లేదా చివరిసారిగా నివసించిన చోటు; లేదా (బి) సంతానము లేదా బంధువు నివసించు చోటు ఈ క్రింది విధముగా దావా చర్యలను తీసుకొనవచ్చును. (2) 5వ పరిచ్ఛేదము క్రింద దరఖాస్తును స్వీకరించిన మీదట, ఎవరికి వ్యతి రేకముగా దరఖాస్తు దాఖలు చేయబడినదో ఆ సంతానము లేదా బంధువుల సమక్షమున హాజరుపరచుటకుగాను ప్రాసెస్ ను ట్రిబ్యునలు జారీ చేయవలెను. 1974లోని 2వది. (3) సంతానము లేదా బంధువును హాజరు పరచు విషయములో ట్రిబ్యునలు, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 క్రింద నిబంధించబడిన విధముగా మొదటి తరగతి న్యాయిక మేజిస్ట్రేటు యొక్క అధికారమును కలిగి ఉండును.