పుట:తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007.pdf/6

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4/G25


1860లోని 21వది.

విశదీకరణ:- ఈ పరిచ్ఛేదము నిమిత్తము “వ్యవస్థ” అనగా సంఘముల రిజిస్ట్రీకరణ చట్టము, 1860 లేదా తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనము క్రింద రిజిస్టరైన ఏదేని స్వచ్ఛంద వ్యవస్థ అని అర్ధము;

(2)ఈ పరిచ్ఛేదము క్రింద భరణపోషణము నిమిత్తము నెలవారీ బత్తెము యొక్క చర్య పెండింగులో ఉన్న సందర్భములో ట్రిబ్యునలు, తల్లి/తండ్రితో సహా అట్టి వయోవృద్ధ పౌరుని మధ్యకాలీన భరణపోషణము నిమిత్తము నెలవారీ బత్తెము సమకూర్చవలసినదని అట్టి సంతానము లేదా బంధువుకు ఉత్తరువు జారీ చేయవచ్చును మరియు ట్రిబ్యునలు ఆయా సమయములందు ఆదేశించునట్టి విధముగా అట్టి సంతానము లేదా బంధువు, తల్లి/తండ్రితో సహా అట్టి వయోవృద్ధ పౌరునికి చెల్లించవలసి ఉండును

(3) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద భరణ పోషణము కొరకు దరఖాస్తు అందిన మీదట దరఖాస్తును గురించి సంతానము లేదా బంధువుకు నోటీసును ఇచ్చిన తరువాత మరియు కక్షిదారులకు ఆకర్ణించుకొనుటకు అవకాశము ఇచ్చిన మీదట భరణపోషణము కొరకైన పైకమును నిర్ధారించుటకు పరిశీలనను చేపట్టవలెను.

(4) భరణపోషణము కొరకైన నెలవారీ బత్తెము మరియు దావా చర్య ఖర్చుల నిమిత్తము, ఉప-పరిచ్ఛేదము (2) క్రింద దాఖలు చేయబడిన దరఖాస్తును, అట్టి వ్యక్తికి దరఖాస్తు నోటీసు తామీలు చేయబడిన తేదీ నుండి తొంబది దినముల లోపల దరఖాస్తును పరిష్కరించ వలెను:

అయితే, ట్రిబ్యునలు అసాధారణ పరిస్థితులలో వ్రాసి ఉంచదగు కారణముల పై ఒక పర్యాయము గరిష్టముగా ముప్పది దినములకు సదరు కాలావధిని పొడిగించవచ్చును.

(5) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద భరణపోషణము కొరకైన దరఖాస్తును ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల పై దాఖలు చేయవచ్చును: అయితే, భరణపోషణము కొరకైన దరఖాస్తులో, అట్టి సంతానము లేదా బంధువు తల్లి/తండ్రి భరణపోషణము చూడవలసియున్న ఇతర వ్యక్తిపై అభియోజితము మోపవచ్చును.

(6) భరణపోషణ ఉత్తర్వు ఒకరి కంటే ఎక్కువ మంది పై చేయబడిన సందర్భములో, వారిలోని ఒకరి మరణము భరణపోషణ చెల్లింపును కొనసాగించుటలో ఇతరుల దాయిత్వము నకు ఏ విధముగాను భంగము కలిగించదు.