పుట:తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007.pdf/4

ఈ పుట ఆమోదించబడ్డది

2/జి 23


(డి) "తల్లి/తండ్రి” అనగా వయోవృద్ధ పౌరులైనను లేక కాకున్నను తండ్రి లేదా తల్లి అది జన్యుపరమైనను, దత్తతపరమైనను లేక మారు తండ్రి లేదా సందర్భానుసారం సవతి తల్లి అని అర్ధము;

(ఇ) “విహితపరచబడిన" అనగా ఈ చట్టము క్రింద రాజ్య ప్రభుత్వముచే చేయబడిన నియమముల ద్వారా విహితపరచబడిన అని అర్ధము;

(ఎఫ్) “ఆస్తి” అనగా ఏ విధమైనదైననూ చర లేదా స్థిర, పిత్రార్జిత లేదా స్వార్జితమైన, సాకార లేక నిరాకార ఆస్తి అని అర్ధము మరియు ఇందులో అట్టి ఆస్తిలోని హక్కులు మరియు హితములు చేరి ఉండును;

(జి) “బంధువు” అనగా సంతానములేని వయోవృద్ధ పౌరుల ఎవరేని శాసనిక వారసుడు అని అర్ధము. అతడు మైనరు కాకూడదు మరియు వారి మరణము తరువాత వారి ఆస్తిని స్వాధీనములో నుంచుకొను లేదా వారసత్వము కలిగియున్నవాడై ఉండవలెను;

(హెచ్) “వయోవృద్ధ పౌరుడు” అనగా భారతదేశ పౌరుడై ఉండి, అరువది సంవత్సరములు లేదా అంతకు పైబడిన వయస్సు కలిగిన ఎవరేని వ్యక్తి అని అర్ధము;

(ఐ) సంఘ రాజ్య క్షేత్రమునకు సంబంధించి “రాజ్య ప్రభుత్వము” అనగా సంవిధానము యొక్క 239వ అనుచ్చేదము క్రింద దాని కొరకు నియమించబడిన పరిపాలకుడు అని అర్ధము;

(జె) “ట్రిబ్యునలు" అనగా 7వ పరిచ్ఛేదము క్రింద ఏర్పాటు చేయబడిన నిర్వహణా ట్రిబ్యునలు అని అర్ధము;

(కె) “సంక్షేమము” అనగా వయోవృద్ధ పౌరులకు అవసరమైన ఆహారము, ఆరోగ్య రక్షణ, వినోద కేంద్రములు మరియు ఇతర సౌకర్యములను సమకూర్చుట అని అర్ధము;

3. ఈ చట్టము కానటువంటి ఏదేని ఇతర శాసనములో లేదా ఈ చట్టము కానటువంటి ఏదేని ఇతర శాసనమును పురస్కరించుకొని ప్రభావమును కలిగిన ఏదేని పత్రమునకు అసంగతముగా ఏమి ఉన్నప్పటికిని ఈ చట్టము యొక్క నిబంధనలు ప్రభావమును కలిగి ఉండును.